పచ్చని కలలతో తరువులా
ఆమె అతని వేళు పట్టుకుని
అడుగులో అడుగైన జ్ఞాపకం…..
మూడు పదుల జీవన సౌరభం
అడుగడుగునా చిచ్చైపొడుచు కు
తింటుంది..మోడైన జీవితo
క్షణo..క్షణం..
* * *
బరువు దిగిందన్న మద్య
తరగతి నిట్టూర్పు
మెరిసేదంతా మెలిమికాదన్న
ఎరుకతెలిసే లోపు వ్యసనపు
పంజాకుచిక్కిన తాళి ఎగ తాలిగా
అరకొరగా దైర్యం లేక ఆర్థిక స్వావలoబనకు
సరిపోని చదువు,ఉరిమినా మెరిసినా
ఏ విపత్తు కైనా
చావును రేవును
అత్తింటిలోనే వేతుక్కోవాలన్న
మనువాదపు..నిరసనల సెగల
నడుమ ఉన్నబoదం తెగిన
సందర్భం దివిసీమ ఉప్పెనను
తలపించి ఉన్నది ఊడ్చుకెళ్లిoది
తెర్లు..తెర్లయిన కుటుంబం
పిల్లల తీసివేతల దైన్యం
అమాంతంగా నిరాశలో
కూరుకుపోయింది దిక్కు దరి
దొరుకని తీరు చూరునీడ
సైతం ఈసడిoచుకొన్న నెనరు
లేనితనాలు నోరుతోమాటాడి
నొసటితో వెక్కిరింత
ఊసర వెళ్ళి సంబందాలు తేటతెల్లం
అయిననిజం ఆక్లిష్ట సమయంలో
సైతం దన్నుగా కూడా నిలబడ్డ…
నా ఉనికి ఎందుకో ఇటీవల
వ్యాకులతతో కుంగి పోతుంది..
తరచూ నీరునీరు అయిపోతుంది
అన్నీదాటి ఒడ్డుకచ్చినoక..
నిరాశ నిస్పృహ జమిలిగాపోటీ
పడిన ఆవరణం…
సమిష్టి అర్థంమారి వ్యష్టిగా
ఏకాఏకీగా ఏకాకులుగా రూపెత్తిన
జీవితాలు ఎవరికి వారుగా
ఎవరిని ఎవరు పట్టించుకోని పట్టనితనంతో
పరుగులు పెడుతున్నారు
పలకరింతలు మాటలు లేఖలు
లేని శూన్యం అరచేతిలో
అమిరిన సౌలతి పుణ్యం
తప్పనప్పుడు మెసేజ్లు
వీడియో కాల్ ల ప్రత్యక్షంగా పంచలేని..
మానవస్పర్శ అపు రూపమై..
కృత్రిమత్వపు ఒరవడిలో
కొట్టుకుపోతున్నారు
ఇప్పుడు ప్రపంచపు భూగోళానికి
డబ్బు ఇరుసుగా
భ్రమిస్తుంది ఆధిపత్యం కోసం
అధిగమించాలన్న అహం కోసం
ఆయుధాలు యుద్దాలు
పసిప్రాణాలెన్ని..పోతున్నా..ప్రాణాలెన్ని
ఈ బీభత్సాల్లో సమిదలవుతున్నా
పాపదోషమన్నది లేక స్వార్ధపు పరిధిలో
పరుగులో ఏటుపోతున్నమన్నది
చివరి గమ్యం ఏమిటన్న
ఆలోచన లేని రోబోల్లాగ
వెల లేని జీవనవికాసాన్ని..
పోగొట్టుకుంటున్నాం..
దూరంగా ఉన్న కొండల
నునుపు నిర్ధారణ కోసం ఒకర్ని పట్టక
ఒకరుగా పరుగు..ఉర్కు..పరుగు గా
ఇదిచూసిన మానవత
తనకక్కడ నిలువ నీడలేదని
మాయమయ్యింది..!!!
– కొలిపాక శోభారాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~