పాలపిట్టా, పాలపిట్టా
పండుగ వొచ్చిందే
కళ్ళముందే సూడగానే
పేనం వొచ్చిందే
అలాకాలొద్దు, అలసాటొద్దు
సెలకలోన సేదదీరవే
పొలములోని సెట్టుపైన
పదిలంగుండు సుట్టానివై
యేటిలోన నీరు తాగి
దాహం తీర్చుకో
వరి యెన్నులు మేసి
కడుపు నింపుకో
పాలపిట్టా ,పాలపిట్టా
నువు సల్లంగుండాలే
పాలపిట్టా, పాలపిట్టా
పదిలంగా సూడాలే
నువు దర్శినమిచ్చే రోజే
మాకు దసరా పండుగే
నీ ఆచూకీ దొరకకుంటే
మాకు సరదా వుండదే
పాలపిట్టా, పాలపిట్టా
మబ్బుల్లో యెగిరి రావే
సిరి దీవెనలిచ్చి
మాకు శుభాలీయవే
– బొబ్బిలి శ్రీధర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~