నాన్న (కవిత )- బి.మానస

నువ్వు కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతతే తెలియదనుకున్నా….
కళ్ళెర్రజేస్తుంటే కాఠిన్య హృదయమునుకున్నా….
మానంగా నువ్వుంటే మాటలే నీకిష్టంలేదనుకున్నా….
ఆజ్ఞలు వేస్తుంటే బానిసగా బాధ పడ్డా….
నాన్నా!!!
నాకిప్పుడే తెలుస్తోంది !!!
వీటన్నింటి వెనుక మూల సూత్రం ఒకటుందని…
మాపైన అమిత ప్రేమని,
మా బాగుకోసం,
భవితకోసం ఆరాటం అని….
నాన్నంటే బంధం మాత్రమే కాదు
నాన్నంటే బలం..
నాన్నంటే భయం మాత్రమే కాదు
నాన్నంటే బాధ్యత…
నాన్నంటే సంతోషం మాత్రమే కాదు
నాన్నంటే సర్వస్వం…

మనకు నడక నేర్పేవాడు నాన్న,
మన నడవడికను సరిదిద్దేవాడు నాన్న….
గుర్రంలా మారి ఆడించేవాడు నాన్న…
తన భుజాలమీద నుంచి లోకం చూపేవాడు నాన్న…
మన ఓటమిలో వెన్నంటి ఉండేవాడు నాన్న,
మన గెలుపులో మురిసేవాడు నాన్న…
తన పిల్లలు తప్పుడు మార్గంలో నడుపకుండా,
జాగ్రత్తలు చెప్పి మంచిగా పెంచి వారి గురించి అందరు
చక్కగా మాట్లాడితే మురిసిపోయె వ్యక్తి నాన్న…
అప్పుడు నాన్న పడే సంతోషం అంతా ఇంతా కాదు..

మాటల్లో చెప్పలేనంత….

నాన్న అనే పిలుపుకన్నా మధురమైనదేది లేదు.-

తేనె కన్నా తియ్యానైనా పిలుపు అంటే నాన్న …

నాన్న మనసు వెన్న వంటిది
ఎంతో మిన్న అమృతం కన్నా…
తేనె కన్నా తియ్యనైనది
వెన్నెల కన్నా చల్లనైనది
ఆకాశం కన్నా విశాలమైనది
నీళ్ళ కన్నా తెల్లనై నది
నాన్న ప్రేమంటే…
స్వచ్ఛమైన ప్రేమతో లాలించి
మనలను పరిపాలించే వ్యక్తి నాన్న…
ఆకాశమంత తెల్లని కాగితంపై
సముద్రమంత సిరాతో రాసినా
వివరించ లేనంత గొప్పవాడు నాన్న
కన్న తల్లి లేకపొతే రోడ్డు మీద ఎవరినైనా
అమ్మా అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు.
కానీ! నాన్న అనే పిలుపు.
ఒక్క సారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా,
దిక్కులు అదిరేలా
పిలిచినా బదులు రాడు!
ఎందుకంటే పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం.
ఇది నాన్నకు మాత్రమే ప్రత్యేకం.
హిమాలయ మంచు శిఖరాల కన్నా
నాన్న ప్రేమ ఎంతో చల్లనిది, అందమైనది.
“అమ్మ” కొవ్వొత్తే – కరిగిపోతు వెలుగునిస్తుంది.
“నాన్న” అగ్గిపుల్ల – ఆ వెలుగుకు నాంది.
ప్రతి భర్త తన భార్యని మహారాణిలా చూడలేకపోవచ్చు,
కాని, ప్రతి తండ్రి తన బిడ్డన యువరాణిలా చూస్తాడు.
ఒక పక్షి స్వతంత్రంగా రెక్కలు విప్పి
ఆకాశంలోకి ఎగిరినప్పుడు
అది ఎంతో ఆనందిస్తుంది.
అంత కంటే ఎంతో ఆనందం
నాన్న అనే పిలుపులో ఉంది.

-బి.మానస .
II B.Sc-Computer Science
Maris stella college. vijayawada.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో