జ్ఞాపకం- 97 – అంగులూరి అంజనీదేవి

“’నా మొగుడు జీవితాంతం జూదం ఆడి నన్ను నా కోడలి దగ్గర పనిమనిషిని చేశాడుఅంది. హృదయం కదిలిపోయింది. వెంటనే నేను హస్విత మంచిది. మిమ్మల్ని అలా చూడదు. మీరు బాధపడకండి పిన్నీ!అన్నాను. ఎంతమంచి కోడలైనా, తోడికోడలైనా డబ్బులుంటే ఆ గౌరవమే వేరుగా వుంటుంది లేఖా! అది నీకు చెప్పినా అర్థంకాదుఅంది. ఆమెది మామూలు బాధకాదు. ఆత్మగౌరవానికి సంబంధించిన బాధ. మగవాళ్ల పరిస్థితి కూడా అంతే! దానికి నిదర్శనం తిలక్ అన్నయ్యనే!అంది సంలేఖ.

తిలక్ ప్రసక్తి రావటంతో రాజారాం ముఖంలో రంగులు మారాయి. ఒకప్పుడు తనను ఎలాంటి స్థితిలో వదిలి తిలక్ గనుల్లోకి వెళ్లాడో గుర్తుచేసుకోవాలంటేనే అతనికి బాధగా వుంది.

నేను తిలక్ అన్నయ్యను కలిసి వచ్చాను అన్నయ్యా!అంది సంలేఖ.

నమ్మలేనట్లు చూసి అవునా?” అన్నాడు.

అవునన్నట్లు తలవూపిందామె. రాజారాం ఏమనుకున్నాడో ఏమో మౌనంగా వున్నాడు.

అసలు విషయానికి వచ్చినట్లు అన్నయ్యా! నాన్నగారికి సమాధి ఎప్పుడు కట్టిస్తావు?” అంది.

ఆ ఆలోచన తనకి రానందుకు చిన్నపాటి ఉలికిపాటు కలిగింది రాజారాంలో.

చాలామంది పెద్దకర్మకి ముందే కట్టిస్తారని విన్నాను. ఇప్పటికే ఆలస్యం అయింది కదా!అంది సంలేఖ.

ఆ మాటలు కొరడాతో కొట్టినట్లు తగిలాయి. విలవిల్లాడాడు రాజారాం.

వాళ్ల మాటల్ని వింటూ అక్కడే వుంది సులోచనమ్మ. కూతుర్ని చూసినప్పటి నుండి భర్త జ్ఞాపకాలు ఆమెను ఎక్కువగా చుట్టుకుంటున్నాయి.

ఆలోచిస్తున్నాడు రాజారాం. సమాధి కట్టించాలంటే ఎంతలేదన్నా కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం తన శాలరీ మీదనే లోన్ తీసుకోవలసి వస్తుంది. అలా తీసుకుంటే ఆ లోన్ ఎప్పటికి తీరాలి? ఆ లోన్ తీరకపోతే- తను ఈమధ్యన తల పెట్టిన ఆ కార్యాన్ని ఈ జన్మలో చెయ్యగలడా? ఒక్కరోజు కాదు. కొన్ని రాత్రుళ్లు, పగళ్లు ఒంటరితనం గుండెను పిండుతుంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయంలో మార్పు జరిగితే తను బ్రతికి కూడా వృధాయే! ఇప్పుడు బ్రతుకుతున్నది కూడా ఆ పనిని చేస్తానన్న ఆత్మవిశ్వాసంతోనే..!

ఆలోచిస్తున్నావా అన్నయ్యా?”

నాకు రావలసిన ఆలోచన నీకు వచ్చినందుకు సిగ్గుపడాలో, సంతోషపడాలో అర్థం కావటం లేదు లేఖా! కానీ నేను మాత్రం ఇప్పట్లో నాన్నగారి సమాధిని కట్టించలేను. ఇప్పుడే కాదు. ఎప్పటికీ కట్టించలేనుఅన్నాడు కచ్చితంగా.

షాక్ తిన్నది సంలేఖ.

వెంటనే ఆ షాక్ లోంచి తేరుకుంటూ పెద్దవాడివి. ఆలోచించు అన్నయ్యా! ఎప్పటికీ కట్టించలేను అనటం అంత కరెక్ట్ కాదేమో. ఎంతయినా కన్నతండ్రి కదా!అంది.

నాకో లక్ష్యం వుంది లేఖా! అది నేను నెరవేర్చాలి. అందుకే నాన్నగారి సమాధిని నేను కట్టించలేను. సారీ!అన్నాడు రాజారాం.

నీ లక్ష్యం ఏంటి?” అని ఆమె అడగలేదు. నవ్వు రాకపోయినా నవ్వింది. ఒక అన్నయ్యకి లక్ష్యం అడ్డు అయితే ఇంకో అన్నయ్యకి అప్పులు అడ్డు. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఏదో ఒక విధంగా సమాధి అయితే కట్టించాలి. ఎలా కట్టించాలి?

ఆ రాత్రంతా ఒకటే ఆలోచన సంలేఖలో…

సంలేఖ ఉదయాన్నే సిరిమల్లె చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తోంది.

తిలక్ మాటలు, రాజారాం నిర్ణయం ఒకదాని వెంట ఒకటి గుర్తొస్తున్నాయి.

అంతలో లేఖా!అంటూ తల్లి పిలవగానే తిరిగి చూసింది సంలేఖ.

ఏంటమ్మా! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్! నాన్నగారికి సమాధి కట్టించాలనేగా. ఇవిగో! నా చేతులకి నాలుగు బంగారు గాజులు వున్నాయి. వీటిలో రెండు అమ్ముకుంటే ఇప్పుడున్న బంగారు రేటును బట్టి మంచి సమాధే కట్టించవచ్చు. నాక్కూడా నాన్నగారికి సమాధి కట్టిస్తే రోజూ అక్కడికెళ్లి దీపం పెట్టుకోవాలని వుందిఅంది ఆశగా.

తల్లి కళ్లలోని ఆరాధనను కరువుతీరా చూస్తూ అలాగే వింటూ కూర్చుంది సంలేఖ.

నేను చెపితే ఎలా వుంటుందో ఏమో. రాజారాం అన్నయ్యతో నువ్వు మాట్లాడు లేఖా! కావాలంటే ఈ గాజులు ఇప్పుడే తీసి నీ చేతికిస్తాను. వాటిని అమ్మే ఏర్పాట్లు చేసి డబ్బు తెచ్చి అన్నయ్యకివ్వు. అన్నయ్య కట్టిస్తాడు. ఆడపిల్లవి. నాన్నగారి సమాధిని నువ్వు కట్టిస్తే బావుండదుఅంది.

అక్కడ ఆ అవ్వకూడా ఇలాగే అందమ్మా! ఆడపిల్లలు సమాధులు కట్టించకూడదా అమ్మా? అది శాస్త్రమా?” అంటూ సంలేఖ ప్రస్తుతం ఆస్తులు సరిగా పంచివ్వలేదని తల్లిదండ్రులకి కొడుకులు తలకొరివి పెట్టకుండా పక్కకి తప్పుకుంటే తలకొరివితో పాటు, కర్మల్ని కూడా చేస్తున్న కూతుళ్లని గుర్తుకు తెచ్చుకుంది.

 

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో