సమూలంగా
ప్రశ్నని సంహరించే కుట్ర
చరిత్రనే ఫేక్ చేసే
నయా ఫాసిజం బరితెగింపు
లౌకిక రాజ్యాంగాన్ని
సహించ లేని నిచ్చెన మెట్ల స్వామ్యం
విద్యాలయాల్లోకి మతం ఇంజెక్ట్
జై శ్రీరామ్ నినాదం వెనుక
సామాజిక అసమానతల కుట్ర
కథలే చరిత్ర గా భ్రమింప జేసే
గూండా గిరిజార్జిరెడ్డి నుండి
నేటి దాకా
విశ్వ విద్యాలయాల మెట్ల మీద
రక్త చారికలెన్నో
మనింటి దర్వాజ మీద
వాడి చేతులు కాళ్ళు
డబడబమని వాయించే దాకా
వూరకుంటే
మనం అజ్ఞానులమే!
బిగించి కొట్లాడక పోతే మళ్ళీ
వాడిదే రాజ్యం!!
మనదో సమూహం
వాడిదో మూక
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~