కౌమార బాలికల ఆరోగ్యం

ఎవరు లైంగిక వేధింపులకు గురవుతారు?

బాలికలు, స్త్రీలు బాలురు, పురుషులకంటే తరచుగా లైంగిక వేధింపులకు గురవుతారు.

ఎవరు లైంగిక వేధింపులు జరుపుతారు?

సామాన్యంగా అపరిచిత వ్యక్తులు, కొన్నిసార్లు బాగా పరిచితులు కూడా లైంగిక వేధింపుల్ని జరుపుతారు. ఉదా:

ఆఫీసులో జూనియర్‌ ఉద్యోగినిపై సీనియర్‌ ఉద్యోగి పదే పదే లైంగిక కామెంట్స్‌ చెయ్యడం.

లైంగిక వేధింపులకు లైంగిక అత్యాచారాలకు తేడా ఏమిటి?

లైంగిక వేధింపు లైంగిక అత్యాచారాలలో ఒక రకం. ముఖ్యమైన తేడా లైంగిక వేధింపులో లైంగిక కలయిక వుండదు.

లైంగిక వేధింపుల్నిఅపరిచితులు జరుపుతారు. లైంగిక అత్యాచారాన్ని ఎక్కువగా బాగా తెలిసిన వారు జరుపుతారు.

లైంగిక వేధింపులకు గురయే బాలికకు సహాయపడడం ఎలా?

*    తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాలలు లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో కీలకపాత్ర వహించగలరు. ‘నిర్లక్ష్యం చేయడం’ లేక ‘పట్టించుకోకుండా వదిలేయడం’ సమస్యకు అన్నివేళలా పరిష్కారమని వారు పిల్లలకు బోధించగూడదు. సాధ్యమైనంత త్వరగా బాలిక లైంగిక దౌర్జన్యం చేసే వ్యక్తికి దూరంగా వెళ్ళేందుకు సహాయపడడం, మళ్ళీ జరిగే ప్రమాదాన్ని తగ్గించడం అవసరం.

*      గోప్యత చాలా ముఖ్యం. ఉపాధ్యాయులు దీనిని అర్ధం చేసుకుని స్టాఫ్‌రూమ్‌లో ఈ విషయాన్ని చర్చించగూడదు.

*      తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీర్పునిచ్చే విధంగా కాకుండా అనుకూల స్పందనతో, ఆసరానిచ్చే విధంగా వేధింపుకు గురయిన బాలికతో వ్యవహరించాలి. ఎవరో చేసే తప్పుడు పనులకు, తప్పుడు ప్రవర్తనలకు వారి బాధ్యత లేదని, వారిని ఈ విషయంలో నిందించమని, నిలదీయమని కౌమార బాలలకు నమ్మకం కలిగేలా చెప్పాలి.

*     ఆసరానిచ్చే పేరుతో ఆ బాలిక మళ్ళీ, మళ్ళీ ఆ అనుభవాన్ని తలచుకుని క్షోభపడేలా చెయ్యగూడదు.

*     పిల్లలు మనసువిప్పి తమ సమస్యను చెప్పి, చర్చించేందుకు తగిన అనుకూల బాంధవ్యం పిల్లలతో వుండాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలి.

*    బాలిక మరీ డిప్రెషన్‌లో కూరుకుపోతే, సైకియాట్రిస్ట్‌ లేక సైకాలజిస్ట్‌ సలహా తీసుకోవాలి

*    వేధింపులు పదే పదే జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వెంటనే తెలపాలని కూడా కౌమార బాలలు గుర్తించాలి.

*   పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమనే తిడతారేమోననే భయంతో ఈ విషయాన్ని వారి నుంచి దాయకూడదు.

లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి ఉపయోగకరమైన సూచనలు :

1. ఒక అపరిచిత ప్రదేశంలో, అపరిచిత వ్యక్తిచేత, మళ్ళీ జరిగే అవకాశం చాలా తక్కువగా వుండే పరిస్థితిలో వేధింపు జరిగినప్పుడు దానిని పెద్దగా పట్టించుకోకుండా వదిలేయాలి. ఉదా: తన జననేంద్రియాలను బస్సులో ప్రదర్శిస్తున్న వ్యక్తిని గమనించడం. ఇక్కడ పట్టించుకోకపోవడమనేది సంపూర్ణంగా వుండాలి. షాక్‌తిన్నట్లు లేక ఆశ్చర్యపోతున్నట్లు కనబడితే అది అవతలి వ్యక్తిని ప్రోత్సహిస్తుంది. ప్రతిస్పందించకపోవడం కొన్ని ఇతర సందర్భాలలో కూడా మంచిదే ఉదా: తెలియని వ్యక్తులు అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడడం. 2. వేధింపును గుర్తించినట్లు, దానిని తాను చాలా అసహ్యించుకుంటున్నట్లు సూచించడం. ఉదా: బస్సులో ఒక పురుషుడు ఒక బాలిక శరీరాన్ని పదేపదే తన శరీరంతో రుద్దుతూంటే ముందుగా ఆమె అతనికి దూరంగా జరిగి వెళ్ళడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. తరువాత అతనిని తిట్టడం కాకుండా సరిగ్గా నిలబడమని దృఢంగా, స్పష్టంగా చెప్పాలి. అతను అప్పటికి కూడా ఇంకా వేధిస్తూంటే కండక్టర్‌కు లేక బస్సులోని ఇతర ప్రయాణీకులకు చెప్పాలి. 3.వేధింపు జరుగుతుందని ఊహించి, నివారించడం.ఉదా: ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్ధినిని ఒంటరిగా ఉన్నప్పుడల్లా ముట్టుకుంటూంటే ఆ విద్యార్ధిని మళ్ళీసారి అతని దగ్గరకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మళ్ళీ అలాగే జరుగుతుందని ఊహించి తనతోపాటు తన స్నేహితురాలిని కూడా తీసుకువెళ్ళాలి. 4.ఒంటరిగా లేక ఒక గ్రూపుతో కలిసివెళ్ళడం, వారి సహాయాన్ని తీసుకోవడం చాలారకాల వేధింపులకు పరిష్కారాన్ని కలిగిస్తుంది.ఉదా: 5. వేధింపు పదే పదే జరుగుతూంటే అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులు – వీరిలో ఎవరితో నైనా చెప్పాలి. వారి సహాయంతో సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నించాలి, తమనే తిడతారేమోననే భయంతో ఈ విషయాన్ని వారి నుంచి దాయకూడదు. 6. అప్పటికీ ఇంకా వేధింపు కొనసాగుతూంటే తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 7. కౌమార బాలలు లైంగిక వేధింపులకు గురవు తున్నప్పుడు దానిని వివిధ కోణాల నుండి పరిష్కరించుకోవాలని వారికి తెలియాలి. ఏ పద్ధతిని ఉపయోగించి అయినా సమర్ధవంతంగా పరిష్కరించుకోగలిగితే ఆ వేధింపును ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 8. కౌమార బాలురు బాలికలపై లైంగిక వేధింపులు జరపడం తమ లోపమే తప్ప గొప్పదనం కాదని గుర్తించాలి. 9. లైంగిక వేధింపుల వారాన్ని పాఠశాలలో జరిపి, ఈ విషయాన్ని గురించి చర్చించాలి. 10. మగపిల్లలు ఆడపిల్లల్ని వేధిస్తున్నప్పుడు విూరే వారిని రెచ్చగొడుతున్నారని బాలికలను దూషించవద్దు.

బాలికలపై లైంగిక అత్యాచారాలు

బాలికల్ని లైంగికంగా ముట్టుకోవడం లేక లైంగిక సంతృప్తికోసం బాలికల్ని ఉపయోగించుకోవడం, వారి ఇష్టానికి వ్యతిరేకంగా సెక్స్‌లో పాల్గొనడానికి బాలికలపై చేసే అన్నిరకాల ఒత్తిడులు, మానభంగం లైంగిక అత్యాచారాలుగా పరిగణింపబడతాయి. ఒక వ్యక్తిని ఆమె/అతని అంగీకారం లేకుండా లైంగిక వస్తువుగా ఉపయోగించుకుంటే దానిని లైంగిక అత్యాచారంగా పరిగణించవచ్చు. 16 సంవత్సరాలలోపు మైనర్‌ బాలల విషయంలోనూ మరియు మానసిక వైకల్యం వున్న వ్యక్తుల విషయంలోనూ వారు లైంగిక కలయిక గురించి, దాని పరిణామాల గురించి తెలుసుకోలేరు గనుక వారికి అంగీకారం వున్నప్పటికి దానిని లైంగిక అత్యాచారంగానే పరిగణించాలి

లైంగిక అత్యాచారాలు – రూపాలు :

1. లైంగిక సంబంధానికి ఒప్పుకోమని ప్రాధేయపడడం లేక ఒత్తిడి చేయడం.

2. ముట్టుకోవడం. 3. లైంగిక సూచనలతో కూడిన మాటలు. 4. బూతుబొమ్మల్ని, బూతు సినిమాల్ని చూపించడం. 5. లైంగిక స్ఫురణను కలిగించే అవాంఛిత భౌతిక ప్రవర్తన, మాటలు సైగలు మొ||నవి. 6. ఆడపిల్లలతో లైంగిక వ్యాపారం..

లైంగిక అత్యాచారానికి ఎవరు గురవుతారు?

*    ప్రతివ్యక్తికి లైంగిక అత్యాచారానికి గురయే ప్రమాదం వున్నప్పటికి బాగా చిన్నపిల్లలకు, టీనేజీ బాలలకు ఈ ప్రమాదం మరీ ఎక్కువ.

లైంగిక అత్యాచారాన్ని ఎవరు జరుపుతారు?

*     తరచుగా పిల్లలు, కౌమార బాలలు, ముఖ్యంగా కౌమార బాలికలపై వారు బాగా నమ్మేవారే అత్యాచారాలు జరుపుతారు – బాయ్‌ఫ్రెండ్స్‌, కజిన్స్‌, బావలు, మామలు, బాబాయిలు, కుటుంబస్నేహితులు, ఇరుగు పొరుగువారు, అన్న, తాత, తండ్రి మొ||

లైంగిక అత్యాచారాన్ని ఎలా జరుపుతారు?

*      ముందుగా తట్టడం, ముట్టుకోవడం, గిచ్చడం, ముద్దుపెట్టుకోవడం, కౌగిలించు కోవడంతో ప్రారంభమవుతుంది. అవి పెద్దగా బాధించేవికావు కనుక, ఇష్టం లేనప్పటికీి ఓర్చుకుంటారు. క్రమేపీ ఇవి పెచ్చు విూరి హస్తప్రయోగం, లైంగిక కలయిక లేక మానభంగానికి పాల్పడతారు.

*      ఇలా చేసే వ్యక్తి మంచివాడో, కాదో నిర్ణయించుకునే శక్తి బాలికకు ఉండదు.

            తెలిసిన వ్యక్తి, తనకు ఇష్టమైనవ్యక్తి, తమకు ప్రేమతో బహుమతుల్ని తెచ్చి ఇచ్చే వ్యక్తి ఇలా చెయ్యడంతో వారికి ఏంచెయ్యాలో తోచక మాట్లాడకుండా ఉండిపోతారు. కౌమార బాలలు ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి సిగ్గుపడి, చెప్పినా ఎవరూ నమ్మరేమోనని భయపడి సహిస్తారు.

*      సామాన్యంగా బాలిక తనకు తెలిసిన పెద్దాయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులకు ఫిర్యాదుచేస్తే వారు నమ్మరు. కాని తల్లిదండ్రులు తమ బిడ్డను నమ్మి ఆ పెద్దాయనకు దూరంగా తమ బిడ్డ సురక్షితంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.

            కౌమార బాలలు మంచి స్పర్శకు, చెడ్డస్పర్శకు తేడాను గ్రహించాలి

మంచి స్పర్శ

1. కరచాలనం చేస్తున్నప్పుడు కొద్దిక్షణాలపాటు చేతుల్ని పట్టుకుని ఊపడం.

2. తలమీద, వీపుమీద మృదువుగా తట్టడం.

3. తలమీద లేక బుగ్గమీద క్షణకాలం ముద్దివ్వడం.

4. చాలా కొద్దిసేపు సున్నితంగా కౌగిలించుకోవడం.

చెడు స్పర్శ

1. చేతుల్ని వదలకుడా నలపడం, తట్టడం.

2. పిర్రల మీద తట్డడం, తొడపాశం పెట్టడం.

3. పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకోవడం.

4. రొమ్ములు, మర్మావయవాలు నొక్కుకునేలా గట్టిగా కౌగిలించుకోవడం.

లైంగిక వేధింపులకు గురయిన బాలికలో కనపడే లక్షణాలు :

1.లైంగిక వేధింపులు ఇంట్లో జరుగుతూంటే ఇంటికి వెళ్ళడానికి అయిష్టం, త్వరగా స్కూలుకు వచ్చి, స్కూలు నుంచి ఆలస్యంగా ఇంటికి వెళ్ళడం. 2. లైంగిక వేధింపులు స్కూల్లో జరుగుతూంటే స్కూలుకు క్రమబద్ధంగా వెళ్ళకపోవడం. 3. ఆందోళన, తీవ్రవిచారం, స్నేహితులకు, మామూలుగా జరిపే కార్యకలాపాలకు దూరంగా జరగడం. 4. చదువులో వెనుకబడడం, చదువుమీద శ్రద్ధ నిలపడం కష్టమవడం. 5. పరిశుభ్రత తగ్గిపోవడం.

6. తరచుగా అలిసిపోవడం, స్కూలుకు వెళ్ళకపోవడం. 7. లైంగిక వేధింపులు ఇంట్లో జరుగుతూంటే ఇంట్లో కొంతమంది అంటే భయం, అయిష్టం. 8. కొన్ని ప్రదేశాలంటే భయం, అయిష్టం. 9. పెద్దలు చెప్పినదానిపై ఆందోళనతో కూడిన శ్రద్ధ, వారేది చెప్తే అది చేసివారిని సంతోషపెట్టాలనుకోవడం. 10. తల్లిదండ్రులకు అంటుకుపోవడం. 11. మనో చాంచల్యం. 12. పారిపోవడం. 13. బాలిక ప్రవర్తనలో స్పష్టంగా కనపడే మార్పు – చురుగ్గా వుండే బాలిక మందకొడిగానూ, మందకొడిగా వుండే బాలిక అస్థిరంగానూ మారడం మొ|| 14. విపరీతమైన సిగ్గు ఉండడం, సహజంగా ఉండవలసిన కుతూహలం లేకపోవడం. 15. రకరకాల స్వల్పబాధలు, శారీరక నొప్పుల గురించి తరచుగా ఫిర్యాదు చేయడం. 16. నిద్రపద్ధతిలో మార్పులు. 17. అసాధారణమయిన ఆకలి లేక ఆకలి మందగించడం, విపరీతంగా తినడం, ఆహారాన్ని దాచడం, తినడానికి నిరాకరించడం మొ|| 18. వేగంగా బరువు పెరగటం లేక కోల్పోవడం. 19. నిద్రలో పక్కవిూద మూత్రం

పోయడం. 20. తమ వయసుకు మించి లైంగిక విషయాలలో పరిజ్ఞానం. 21. తరచుగా స్నానం చెయ్యడం, శుభ్రపరచుకోవడం. 22. ఎవరిని నమ్మాలో తెలియకపోవడం, వంచింపబడినట్లు భావించడం. 23. భావోద్వేగాలను నియంత్రించే మెదడుభాగం సరిగ్గా ఎదగకపోవడం. 24. అపరాధభావన, తనదే తప్పు అని భావించడం 25. తన నెవరూ నమ్మరేమోనని, తను జరిగిన దానిని బయటపెడితే కుటుంబంలో పొట్లాటలు జరుగు తాయేమో, విడాకులకు దారితీస్తుందేమో, పోలీసులు, కోర్టు గొడవల్ని తట్టుకోలేమేమోనని భయపడుతుంది. 26. సన్నిహిత బంధువులతో సంబంధానికి విలువనిచ్చే బాలిక ఆ వేధింపుల గురించి బయటకు చెప్తే ఆ బాంధవ్యాన్ని కోల్పోవలసి వస్తుందేమోనని భయపడుతుంది. 27. వేధింపు గురించి బయటకు చెప్తే మళ్ళీ, మళ్లీ, మరింత ఎక్కువగా వేధింపుకు గురవుతామోనని భయపడుతుంది.

జీవితాంతం బాలికకు నష్టం కలగజేసే తీవ్ర ప్రభావాలు :

1. తీవ్రమైన అవమానభారం, ఆత్మగౌరవం తక్కువగా వుండడం. 2. లైంగిక వేధింపులకు గురయిన బాలికలు జరిగిన సంఘటనకు తామే బాధ్యులమని భావిస్తూ తమను తాము నిందించుకుంటారు. తామెందుకూ పనికిరానివారమని, తమకు ఏ సామర్ధ్యం లేదని, తమకే ప్రాధాన్యం లేదని భావిస్తారు. ఆత్మన్యూనత పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది.

ప్రవర్తనా సమస్యలు :

1. మత్తు మందుల వ్యసనం 2. మద్యపాన వ్యసనం 3. ఎక్కువ ప్రమాద భరితమైన లైంగిక ప్రవర్తనలు 4. లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురైన బాలిక ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఇతరులపై నమ్మకాన్ని పొగొట్టుకుని తీవ్రంగా క్రుంగిపోతుంది. ఈ వేధింపుల తాలూకు శారీరక, మానసిక గాయాల్ని, తద్వారా జరిగే అనేక నష్టాల భారాన్నీ మోస్తూ పెరుగుతూ డిప్రెషన్‌ నుండి తప్పించుకోవడానికి సంఘర్షిస్తుంది. 5. పెద్దయాక ఇతరులతో సక్రమమైన సంబంధాల్ని పెంపొందించుకోలేదు.

లైంగికఅత్యాచారానికి గురయిన బాలికను గుర్తించే రెండు ప్రముఖ సూచికలు:

1. గర్భం   2. లైంగిక వ్యాధులు, హెచ్‌ ఐ వి / ఎయిడ్స్‌

నేర్పుగానూ, సురక్షితంగానూ ఉండడానికి 8 మార్గాలు:

1.బహుమతులు : కొన్నిసార్లు విూకు అసౌకర్యంగా అనిపించేవాటికి ప్రతిగా విూకు స్వీట్స్‌ లేక డబ్బుని ఇచ్చి మిమ్మల్ని మోసగించడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చు. వారు అడిగిన దానికి నిరాకరించండి, వాళ్ళిచ్చేది తీసుకోకండి.

2.శరీరం : విూ శరీరం కేవలం విూదే. విూకు నచ్చని విధంగా ఎవరైనా ముట్టుకుంటే లేక హాని కలిగిస్తే ‘నో’ అని చెప్పండి. విూకు నమ్మకంఉన్న వ్యక్తికి ఈ విషయం చెప్పండి.

3.అరవండి : అరవడాన్ని ప్రాక్టీస్‌ చెయ్యండి. ఎందుకంటే విూకు ఇష్టంలేని విధంగా ఎవరైనా మిమ్మల్ని ముట్టుకోవడం లేక హాని కలిగించడానికి ప్రయత్నిస్తే విూరు చెయ్య గలిగింది అదే.

4.పరుగెత్తండి: ఎవరైనా విూకు నచ్చని విధంగా విూతో మాట్లాడితే లేక మిమ్మల్ని ముట్టుకుంటే పరుగెత్తి పారిపోండి.

5. చెప్పండి: ఎవరైనా మిమ్మల్ని ముట్టుకున్న విధానం లేక విూతో ప్రవర్తించే విధానం విూకు విచారం కలిగించేదిగా, అసౌకర్యం కలిగించేదిగా లేక భయం కలిగించేదిగా ఉంటే అది విూ తప్పు కాదు. విూకు నమ్మకం ఉన్న పెద్దవారిరెవరికౖౖెనా ఈ విషయం గురించి చెప్పండి ఏదో ఒక చర్య వారు తీసుకునే దాకా చెప్తూనే ఉండండి.

6. కౌగిలింతలు, ముద్దులు: ముఖ్యంగా విూకు ఇష్టమైన వ్యక్తుల నుండి లభిస్తే చాలా ఆనందం కలుగుతుంది. కాని ఆ విషయాన్ని రహస్యంగా ఉంచకండి. ఎవరైనా దానిని రహస్యంగా ఉంచమని చెప్తే తప్పని సరిగా విూకు నమ్మకం ఉన్న పెద్ద వారితో ఆ విషయం చెప్పాలని గుర్తుపెట్టుకోండి.

7. వద్దు (నో) : నో-ఇది తప్పనిసరిగా నేర్చుకోవలసిన ముఖ్యమైన పదం.  విూకిష్టంలేని విధంగా ఎవరైనా మాట్లాడినప్పుడు లేక ముట్టుకున్నప్పుడు బిగ్గరగా నో అనడం నేర్చుకోండి.

8. రహస్యాలు : ఎవరైనా విూకు అసౌకర్యం కలిగించే విధంగా ముట్టుకుని లేక మాట్లాడి, దానిని రహస్యంగా ఉంచమని కోరితే అలా చెయ్యకండి. విూకు నమ్మకం ఉన్న పెద్దవారితో ఆ విషయాన్ని చెప్పండి.*

– డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)

********************************************

Uncategorized, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో