నీస మద్దతు-(ధర ) – (కవిత)- బీర.రమేష్

వాళ్ళు అడిగిందేమిటి ?

పారిశ్రామికవేత్తలకి చాటుగా చేసినట్టు

కోట్ల రుణ మాఫీలు అడగం లేదు

ఎగవేతదారుల చేతుల్లో మోసపోయిన బ్యాంకుల్లా

నష్టపరిహారాలు అడగడం లేదు

లాభాలు లేని సంస్థకి మోస లాభాలు చూపించి

పారితోషకాలు అడగడం లేదు

నిలువెత్తు విగ్రహాలు నిర్మించడానికో

గుడి గోపురాలు కట్టించడానికో

ధన మద్దతు ఇమ్మని వాళ్ళు అడగంలేదు

దేశానికి ఆకలి తీర్చే రైతులు అడిగేది

కష్టపడి పండించిన పంటకి

కనీస మద్దతు ధర

అప్పులు తెచ్చి పక్క దేశాలకిచ్చే దేశం

అన్నదాతల్ని రోడ్ల మీదకి నెడుతోంది

రైతుల పంటని పొరుగు దేశాలకి పంచె దాతృత్వ దేశం

పండించిన రైతుని పరుగెత్తిస్తోంది

కనీస మద్దతుధర నిచ్చి పొలాల్ని కాపాడమన్నందుకు

ఇనుపకంచెలు,సిమెంటు దిమ్మలు,తుపాకులు,కర్రలతో

అన్నం పెట్టె పొలాలకు గాయాలు చేస్తోంది

ముళ్ళకంచెల్ని కొడవళ్ళతో నరికే చేతులకి

ఇనుప కంచెల తొలగింపు తెలియంది కాదు

కొండల్ని పిండి చేసి చదును చేసిన చేతులకి

సిమెంటు దిమ్మలు బద్దల గొట్టడం చేతనవంది కాదు

ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసన వారసత్వ మార్గం

అణచివేయాలను కోవడం నిరంకుశత్వ ప్రభుత్వ లక్షణం

ఇన్ స్టా గ్రామాల్లో, వాట్ సాప్ గృహాల్లో , ఫేస్ బుక్ గోడల మధ్య

నిరంతరం తీరికలేక నివసించే దేశ ప్రజానీకం

చలిలో ,ఆకలితో, రోడ్ల పై గాయాల దేహాలతో

నినదిస్తున్న రైతుల పోరాటానికి

కనీస మద్దతు నివ్వడం

ఆకలి పేగు కలిగిన దేశం బాధ్యత.

 

-బీర.రమేష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో