మగువ(మెరుపులు)-చంద్రకళ. దీకొండ

దండలో దారంలా
బంధాలను నిలుపుతుంది
మబ్బుల్లో మెరుపులా
నవ్వులు రువ్వుతుంది!

సహనంలో అవని
క్రమశిక్షణకు గురువు
ప్రేమించుటలో జనని
త్యాగానికి తరువు!

మమతల మాగాణి
సంసారానికి సారథి
అలరించే రేరాణి
కుటుంబానికి వారధి!

సహకారానికి మారుపేరు
సమస్యలను పరిష్కరించును
మమకారానికి తల్లివేరు
శాంతిని నెలకొల్పును!

అధికారపు అహమెరుగదు
సమర్థతతో పాలించును
అవినీతిని సహించదు
అందరినీ అలరించును!

పసికూనల లాలించు
ప్రేమనే పంచును
కంటిచూపుతో శాసించు
అనురాగం అందించును!

చదువుల్లో సరస్వతి
పోటీపడి గెలుపొందును
దీక్షలో పార్వతి
అనుకున్నది సాధించును!

సుగుణాల సుదతి
ఇలలోని దేవత
చిరునవ్వుల చేమంతి
ఆగ్రహిస్తే కాళీమాత!

-చంద్రకళ. దీకొండ,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో