ఆత్మ సఖా….!!(కవిత)-సుధా మురళి

విషాద విపంచినై తటపటాయిస్తూ వుంటే
వెన్నెల కిరణానివై ఎదురొస్తావు
మౌన మోడునై ఎడబాటున శయనిస్తే
ఆశల తీగలతో అల్లుకుపోతూ
అమృత పాశాల వెంట నడిపిస్తావు…..

ఎందుకు నాపై ఈ తపనంటూ
అరమోడ్పు కన్నులతో ప్రశ్నను సంధిస్తే
అచ్చెరువును అద్భుతంగా నటిస్తూ నవ్వి నడిచెళ్ళి పోతావు

కలల కలలను కంటూ
ఒంటరైన కనుపాపలు
భిన్న హృదయాల బింబాలలో తలదాచుకుంటుంటే
నీకదే ఆఖరి చోటు అయినట్టు
రెప్పల మధ్యన పెద్ద మంటను పెడతావు

ఎప్పటిది
ఈ వియోగం
దిగంతాల కావల మౌనాన్ని సంభాషించిన కాలానిదా
దివారాత్రుల నిర్మలత్వాలపై కాలు దువ్విన
వెలుగు చీకట్ల సంభోగ సమయాల నాటిదా
అమరత్వ అరుచిని ఆస్వాదిస్తూ భ్రమర జీవితాన్ని
కాలదన్నుకునిన మరణ శయ్య మరణ వార్తను విన్న నాటిదా

ఎప్పటిది
ఈ వియోగం
ఈ అత్యంత విషాదం
అన్న సందిగ్ధ తెరను తెరిచేస్తూ
ఆరాగా మారిన నీ ఊపిరితో సమాధానపు స్పష్టానివవుతావు
సృష్టి స్థితిల పుట్టుకే
మనకు మూలమంటూ
నాలో లయమవుతావు
లయ బద్ధుడవై మిగిలిపోతావు

-సుధా మురళి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో