బస్సు (కవిత)-గిరి ప్రసాద్ చెలమల్లు

ఎడ్ల బండి దారెంట
బంధాలు బల పడిన నేల
కొంగు తడిసి కన్నీరింకిన నేల
డొంక దారిన
బండి ఎగుడు దిగుడు దారెంట
పడుచు హృదయాల కోలాహలం
అమ్మానాన్నల వీడినా బండి పయనంలో దగ్గరై
చుట్టు ముట్టే  సంబంధాలు
కూత వేటులో బిడ్డలు
నాటి పెళ్ళిళ్ళు  పేరంటాలు
సందడిలో ఇల్లంతా
బస్సులొచ్చాయి
సంబంధాలు దూరం
బంధాలు దూరం
చుట్టపు చూపుగా ఏటికో మారు
వ్యయ ప్రయాసల భరించ కష్టమై
కార్డు ముక్కల తో మొదలైన కుశ లోపరి ముచ్చట
సెల్ ఫోన్లలో నే సాధక బాధకాలు నేడు
మనిషి మనిషి తో మాట్లాడటమే గగనమై
గూగుల్ యే ప్రపంచమై
తల్లీ బిడ్డా ఆలింగనం లో మాధుర్యం మరిచినే!!
ఉచితం బాగో కాదో ఎరుకలే
బస్సెక్కి బంధాల బలపడే దిశగా ఆమెలు!
బాహ్య ప్రపంచ జ్ఞానానికి తొలి మెట్టు!
మానవ వనరుల మానసిక ఉల్లాసమే ప్రగతి చక్రం!!
( తెలంగాణ ప్రభుత్వ మహిళల కు ఉచిత ప్రయాణ నిర్ణయం సందర్భం గా)
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో