అవ్యక్తా…(కవిత)-సుధా మురళి


ఏవీ అంత త్వరగా పొందలేము
ఇష్టాలను, ద్వేషాలను
వేటినీ ఒక్క పెట్టున సాధించలేము
కష్టాలను, సుఖాలను

జరుగుతున్నవన్నీ
కురుక్షేత్ర యుద్దాలే
న్యాయ అన్యాయాలు
ధర్మ అధర్మాలు
ఏవో తెలియచెప్పలేని అంతర్గత రోదనలే

మండుతున్న గుండెలన్నీ
రావణ కాష్ట ప్రతిరూపాలే
వివేక విచక్షణల
జ్ఞాన అజ్ఞాన సంఘర్షణల కార్చిచ్చులే
మకిలిపై మెరుస్తున్న మనసు మాయలే

జీవితాలన్నీ
భిన్న కథనాల కూర్పులే
కంచికి చేరని కథల
విరామం ఎరుగని భాధ్యతల
ఒంటరి సమూహ గాయాలే
దేహ అదేహ యాత్రల జుగల్బందీలే…

-సుధా మురళి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో