ఆమె కావులించుకుంది భయంగా
పిడిగుపాటుకు మెరుపు మెరిస్తే
ఎంత బాగుంటుందో ఇలాగే
మరో రెండ్రోజులు వాన కురుస్తే !
-రియాజ్ భైరాబాదీ
ఒకప్పటి నా మనస్థితి పై
నాకే వచ్చేది నవ్వు
యిప్పుడు మాత్రం నాలో
అలాంటివేవి లెవ్వు
-గాలిబ్
నన్నెవరైనా పొదువుకొని
ధరిస్తారా ఒక మాలగా
చెదరిపడి వున్నాను
నేలరాలిన ముత్యాలుగా
-సాబిర్ షహాజాద్
ఎటువంటి మేఘమిది ?
దీనికేలాంటి నీడా లేదు
దూపగొన్న హృదయాలను
సేదదీర్చే జాడా లేదు
-కతీల్ షిఫాయీ
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~