ఒకే ఒరలో
రెండు కత్తుల్….
మనిషికి లేవా
రెండు నాలుకలు
****
కొండలు గుండెలు
పగులుతున్నయి
మనిషిని వెతకాల్సింది
బండల్లోనే …
****
చెమట చుక్కలు
సైతం సలాం..
వచ్చేది నాయకుడు కాదు
శ్రామికుడు
****
వాడి మనసు
వాడిన కత్తి
కవిత్వం లోనూ నాతే
పదును
****
మట్టికి ప్రాణం పోసిన
కుమ్మరి
కాలచక్రంలో
దేశ దిమ్మరి
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~