మద్రాస్ లెజిస్లేటివ్ సభ్యురాలు ,వ్యక్తిగత సత్యాగ్రహి ,రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి ,సంస్కర్త,పార్లమెంట్ మెంబర్  –శ్రీమతి చోడగం అమ్మన్న రాజా- గబ్బిట దుర్గాప్రసాద్

కృష్ణాజిల్లా మచిలీ పట్నం లో శ్రీ గంధం వీరయ్య నాయుడు ,శ్రీమతి నాగరత్నమ్మ దంపతుల పదకొండు మందిలో  ఏడవ సంతానంగా శ్రీమతి అమ్మన్నరాజా 6-6-1909 లో జన్మించారు .తండ్రి కృష్ణాజిల్లాకైకలూరు లో  బోర్డ్ స్కూల్ టీచర్ .అక్కడ స్కూలు లేదు.ఊళ్ళో ఉండి చదువుకోవటానికి చాలా ఇబ్బందులు పడి ,చివరకి రాజమండ్రి  వెళ్ళి హైస్కూల్ లో చేరి ,హాస్టల్లో ఉంటూసంపన్నులైన  శ్రీ  కంచుమర్తి  రామ చంద్రరావు గారు తమ కుమార్తె పేరిట ఇచ్చే స్కాలర్షిప్ తొ చదివి  స్కూల్ ఫైనల్ పాసయ్యారు .  అప్పుడు హాస్టల్ లో హైస్కూల్ పిల్లలు ముగ్గురో నలుగురో మాత్రమె ఉండేవారు .

  మద్రాస్ వెళ్ళి ప్రభుత్వ ఉపకార వేతనంతో కాలేజిలో చేరి ,ప్రిన్సిపాల్ మిస్ దిలాహే అనే బ్రిటీష్ వనిత తల్లిలాగా ఇచ్చిన ప్రోత్సాహక సహకారాలతో చదివి ,1932లో డిగ్రీ పాసై ,విల్లింగ్టన్ ట్రెయినింగ్ కాలేజి లో  టీచర్స్  ట్రేయినింగ్ పొంది ఎల్ .టి.పాసై ,తండ్రి రిటైర్ అవగా కుటుంబానికి ఆదాయం లేక ఇబ్బందులు పడుతుంటే తాను  ఈ మహానగరం లో హాయిగా ఉండటానికి ఇష్టం లేక ,సికందరాబాద్ గరల్స్ హైస్కూల్ లో కొంతకాలం టీచర్ గా పనిచేసి ,బాపట్లలో శ్రీ వెలగపూడి సుబ్బారావు నెలకొల్పిన  ట్రేయినింగ్  స్కూల్ లో హెడ్ మిస్త్రేస్ గా పని చేశారు .

 మౌంట్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా దేశం లో ఎన్నికలు జరిగి ,మద్రాస్ ప్రేసిడేన్సిలో ఉన్నఆంధ్రదేశంలో స్త్రీలకు  కేటాయింపబడిన ఏలూరు నియోజక వర్గానికి పోటీ చేయటానికి ఎవరూ ము౦దుకు రాకపోతే కాంగ్రెస్ పార్టి అమ్మన్న రాజాను నిలబెట్టగా ,శ్రీమతి సరోజినీ నాయుడు ,శ్రీ భూలాభాయ్ దేశాయ్ వంటి ప్రముఖులు ప్రచారం చేయగా శాసన సభ్యురాలుగా ,అతి చిన్న వయసులోనే గెలిచారు .అప్పటికి రాజకీయ అనుభవం ఏమాత్రం లేకపోయినా శ్రీ మతి ఆచంట రుక్మిణీదేవి ,కుట్టిమాల్ అమ్మ వంటి వారి సహకార ,సాహచర్యంతో రాజ నీతిజ్ఞు రాలయ్యారు .ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం రావటం బ్రిటీష ప్రభుత్వం భారత ప్రజల అభీష్టం తెలుసుకోకుండా యుద్ధంలో పాల్గొనటం వలన అవమానంగా భావించిన కాంగ్రెస్ తీర్మానం ప్రకారం 1939లో అమ్మన్నరాజాతో సహా కాంగ్రెస్ సభ్యులంతా  రాజీనామా చేసి బయటికి వచ్చారు.

 పోల్లాచిలో మునిసిపల్ ఇంజినీర్ గా ఉన్న శ్రీ చోడగం జనార్ధనరావు తొ అమ్మన్న రాజా వివాహం 27-8-1940 న జరిగి కాపురానికి పొల్లాచి వెళ్లారు .వెళ్ళిన రెండు నెలలకే  ప్రభుత్వ నిరంకుశత్వానికి ,అరెస్ట్ లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టి వ్యక్తి సత్యాగ్రహాలు ప్రారంభించగా ,దేశ జనులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో హాయిగా కూర్చోటానికి ఇష్టం లేక భర్తను ఒప్పించి ,ఏలూరు చేరి , స్వంతవూరు కైకలూరులో 1940లో వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొని అరెస్ట్అయి , ఒక ఏడాది రాయవెల్లూరు జైలులో కఠీన శిక్ష , 500రూపాయల జరిమానా సత్కారం పొందారు బ్రిటీష ప్రభుత్వం చేత .   ఆ జైలులో ఆచంట రుక్మిణీదేవి ,కృష్ణాబాయ్ నీమ్బ్ కర్,ఉప్పల మెల్లీ షోలింగర్ అనే స్విస్ మహిళ మొదలైన స్త్రీలు 80మందితో సరదాగా గడిపారు .సాయంత్రం ఆరులోపలె భోజనాలు ఆతర్వాత గదులకు తాళాలు వేసేవారు అధికారులు .ఒక రోజు  జైళ్ళ ఇన్స్పెక్టర్ జనరల్  తనిఖీకి వస్తే అమ్మన్నరాజా ‘’మేమంతా సాధారణ నేరస్తులంకాదు. దేశం కోసం వచ్చాం .మీరు పొమ్మన్నా బయటికి పోము ఎందుకు మమ్మల్ని రాత్రంతా తాళాలు వేసి బంధిస్తారు ?“’అని అడిగితె సబబే అని పించి ,రాత్రిళ్ళు తాళాలు వేయటం మాన్పించాడు .తమలో తాము హిదీ, ఇంగ్లిష్ క్లాసులు నిర్వహిస్తూ ,చదరంగం, బాడ్ మింటన్ ఆడుకొంటూ ,నూలు వడ కటం లో పోటీలు పెట్టుకొనే వారు .శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ అతి సన్నని నాజూకు దారం తీస్తే,అమ్మన్న రాజా  అతి వేగంగా దారం తీసేవారు .జైలు జీవితాన్ని పండుగలాగా గడిపారు అందరూ .

  1941లో విడుదలై ,అమ్మన్నరాజా 1946ఎన్నికలలో ఏలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ,డాక్టర్ కొమర్రాజు అచ్చమా౦బగారిని ఓడించి శాసన సభ్యురాలై ,అసెంబ్లీ డిప్యూటీ స్పెకర్ గా1952 వరకు  ఉన్నారు .దేవదాషీ విధానాన్ని నిరశిస్తూ ,నిర్మూలనకు చట్టం తీసుకు రావాలని తీర్మానం ప్రవేశపెట్టిన డాక్టర్ ముత్తు లక్ష్మీ రెడ్డిగారితో కలిసి ,సాధించారు .పదకొండేళ్ళ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో 1950లో వరకట్న నిరోధక చట్టం ప్రవేశ పెట్టి సాధించారు .ఇవన్నీ ఆమె శక్తి సామర్ధ్యాలకు ,సంఘ సేవానిరతికి,సంస్కార భావాలకు  దర్పణాలు .ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగి 1955లో వచ్చిన మధ్యంతర ఎన్నికలలో పశ్చిమ గోదావరిజిల్లా అత్తిలి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచి ,1960లో రాజ్యసభ  మెంబర్ అయ్యేవరకు ఉన్నారు  .ముఠారాకీయాలకు విసిగి  వేసారి ఆమె 1968లో బయటికి వచ్చేశారు .ఆంధ్రరాష్ట్ర స్త్రీశిశు  విద్యా సమితికి చైర్మన్ గా చాలాకాలం పని చేశారు .ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ చేంజి లో స్త్రీలను కూడా నమోదు చేసుకొనే అవకాశం కల్పించారు .స్త్రీలకు సాయంకాల కాలేజీలు ,ఫిజికల్ ఎడ్యుకేషన్ శిక్షణకు ప్రత్యేకకాలేజీల ఏర్పాటుకు కృషి చేశారు .90ఏళ్ళ వయసులో శ్రీమతి అమ్మన్నరాజా 22-2-1999  న మరణించారు .

 –గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో