బాల్యంలో
అమ్మ నేర్పిన పచ్చీ సాట
బ్రతుకంతా ఇప్పటికీ
అదే బాట
***
కారు చీకట్లోను వెన్నెల
కవిత్వం…
జీవితాలను చిలికిన
తత్త్వం
***
అన్లైలో చదువు
బలైంది
విద్యరులా …టీచర్లా ..
తల్లుదండ్రులు కూడా..
***
గృహ ప్రవేశం , వివాహం
పండుగేదైనా
పెద్దిర్కం
మట్టి కుండదే
***
కవయిత్రి
కుమ్మరి మొల్ల
మట్టిలో పుట్టిన
మాణిక్య మాల
***
చైత్ర మాసం
వచ్చింది
పంచ వన్నెల చీరతో
ప్రకృతి కదిలింది .
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~