గద్దరంటే –
తనలో నిక్షిప్తమైన కోట్లాడి గుండెలతో
గన్ ని లోడ్ చేసి శతృవు గుండెకు గురి పెట్టినవాడు!
గద్దరంటే –
కల్తీ కాంట్రాక్ట్ రాజకీయ
ధనస్వామ్యపు ట్రంక్ రోడ్డున
కాలికి తగిలిన ఎదుర్రాయిని తీసి
క్యాట్ బాల్ కి బిగించి దోపిడీ వటవృక్షాన్ని
చాచ్మని లాగి కోట్టి నేలకూల్చినవాడు !
గద్దరంటే – –
నిస్సహాయుల , అన్నార్తుల కన్నీటిని
ల్యాండ్మైన్ చేయగలిగినవాడు
భూస్వాముల , పెట్టుబడిదారల
గుండెల్లో విస్పోటనం పుట్టించినవాడు!
గద్దరంటే –
బ్రూరాక్రసీ బుట్టలో పడే
రాడికల్ కాదు
సొంత ఉనికిని సైతం
ప్రజా జీవితానికి అర్పించిన
విప్లవ ప్రజాగాయకుడు
సాయుధ పోరాట యోధుడు !
నీలం . సర్వేశ్వర రావు
~~~~~~~“““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““