మట్టి వాసన
మైమరపిస్తోంది
మేఘం
చినుకై ముద్దాడింది
****
చెలిమె తోడితే
ఊరేవి నీళ్ళు
మనసు మరిగితే
ఉబికేవి కన్నీళ్లు
****
అతడి మాటలు వినటానికి
చప్పచప్పగా
చెప్పినవి
నిఖార్సైన నిజాలు గదా !
****
నేతన్న
విపణిలో నేర్పరే …
బతుకు బడిలో
ఎప్పుడూ ఆఖరు …
****
బంధాలన్నీ బరువైనై
మనుషులకు
మోయాల్సిందిక
వాట్సప్ లోనే !
****
మర, మనిషీ
ఒక్కటైనయి
ఇక మట్టి కూడా
బంగారం కావాల్సిందే
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~