మహిళా విద్యావ్యాప్తికి కృషి చేసిన గుజరాత్ సామాజిక సేవికురాలు –పద్మశ్రీ ప్రభా బెన్ – గబ్బిట దుర్గా ప్రసాద్

20-2-1930 న జన్మించిన ప్రభా బెన్ షా 18-1-2023 న 93వయేట మరణించింది .పన్నెండవ ఏటనే సామాజిక కార్యకర్త గా పని చేసింది .గుజరాత్ మీడియం ప్రైమరి స్కూల్-1963లో స్థాపించి౦ది .1963లో మహిళా మండలి ఏర్పరచి స్ట్రీ సంక్షేమం కోసం కృషి చేసింది .1921లో గుజరాత్ లోని కచ్ లో వచ్చిన తీవ్ర భూకంపంలో సర్వం కోల్పోయిన వారికి అన్ని విధాలా సాయం చేసింది . ఆతర్వాత 2018లో కేరళలో వచ్చిన వరద భీభత్సానికి గురైన వారికి సకలవిధాలా తోడ్పడి ఆదుకున్నది . గుజరాత్ లోని సూరత్ జిల్లా బార్డోలి పట్టణం లోని స్వరాజ్ ఆశ్రమం లో చేరి మహాత్మా గాంధీ ప్రభావంతో స్వాతంత్రోద్యమం లో చేరింది.1969నుంచే డామన్ లో కుట్టు నేర్పే క్లాసులు నిర్వహించి మహిళా ఉపాధికి తోడ్పడింది .మహిళా సహకార సంస్థ ,మహిళా క్రెడిట్ సొసైటి ఏర్పరచి సాయపడింది .గుజరాతీ ,ఇంగ్లిష్ భాషలలో బాల్వాడి అనే నర్సరీ స్కూల్ స్థాపించి బాల బాలికల విద్యా వ్యాప్తికి తోడ్పడింది .ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధులకోసం ఒక గ్రంథాలయం స్థాపించింది .వరకట్న నిషేధం పై ఉద్యమాలు నడిపింది .డామన్ ,డయ్యు లలోనేకాక గుజరాత్ , డి .ఎన్. హెచ్. కార్య క్షేత్రాలలో లలో కూడాతన సేవలను విస్తరింపజేసి విస్తృత సేవలు అందించింది . సుభాగ్ షా ను వివాహం చేసుకొన్నది. ఆదంపతులకు వర్షా షా .కిరణ్ షా కుమార్తెలు .సంజయ్ షా కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు .ప్రభా బెన్ కంటే పదిహేనేళ్ల ముందు భర్త మరణించాడు. వర్ష షా డామన్ లో తల్లి ప్రభా బెన్ కు కనిపెట్టు కొంటూ ఉన్నది .

డామన్ డయ్యు లో జన్మించిన ప్రభా బెన్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గారి చేతులమీదుగా అందించి గౌరవించింది .92 వ ఏట ప్రభా బెన్ షా హార్ట్ అటాక్ తో మరణి౦చింది.

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో