అవ్వ
అనురాగాల గని
ముడుతలు ముఖానికే
మనసుకు కాదు
****
మనిషిలా ప్రకృతికీ
రెండు ముఖాలు
ఉరుములు…
చినుకులు…
****
పొలంలో
నాట్లు వేస్తున్నారు
మట్టి చేసే
మహా యజ్ఞానికి శ్రీకారం
****
పునాదులు లేని
భవనాలు –
అవే కదా
మన స్మార్ట్ సిటీ దృశ్యాలు
****
సానపడితే
ఇనుముకు పదును
కష్టాలోర్చితేనె
జీవితానికి అదును
****
దేశమంతా
స్వచ్చ భారత్
మరి మనోమాలిన్యం
పోయేదేలా ?
****
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~