ఎవరిది తప్పు ?
కొత్తపెళ్ళి కూతురిలా
అత్తవారింట కాలు పెట్టా
కోడలునని మరచి
కూతురిలా దగ్గరవ్వాలని మనసు నిశ్చయం
ఇల్లాలిగా ఇంటిల్లపాదితో
ప్రేమతో మసలాలనే అనుకున్నా
మరి ఆహ్వానం లేదే!?
విచిత్రం వేట
అంతా అయోమయం
కోడలు కోడలే
కరగని అత్త గారు
ఆజ్ఞల మిషన్ లా సదరు భర్త
ప్రతి పనికి పర్మిషన్
పరాయి వ్యక్తిలా..
అందరి అవసరాలకు
తల ఊపే రోబోలా
ఉత్సాహం నిరుత్సాహమై
కలలుకన్నీరై
ఆశల మేడలు కూలిపోతే
ఎవరిది తప్పు?
-యలమర్తి అనూరాధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~