సజీవం (కవిత) – గిరి ప్రసాద్ చెలమల్లు

తాతా!
జంతు సంఘర్షణ
తరాలుగా సాగితే
నీ సంఘర్షణ పరిశీలన తో సాగిందే!

అదేమీ అక్కర్లేదు
కుండలో బురదలో పండులో పాయసంలో
ఫలదీకరణం
గుడ్డిగా నమ్మే మెదళ్ళు
వున్నంతకాలం భజనలు కీర్తనలు చెల్లు

కీటకాలు
శిలాజాలు ఎన్నో ఎన్నెన్నో
నీ సముద్ర యానంలో
నీ కంటపడితే
ఊరుకోక నీలోని జిజ్ఞాస
నీ ఇంటికి చేర్చే దాకా మనసు తల్లాడిందే!

సమస్త ప్రాణ కోటి ఎలా పుట్టిందో
చెప్పలేని స్మృతి ఒక్కటి
తల భుజాలు తొడలు పాదాలు యోనులై
నెట్టబడితే పుట్టారని అసృష్టి అయినా జై కొట్టే ఉన్మాదుల నేల!!

నీ పరిశోధన
మా బతుక్కి మూలం
మాకు హేతువు అందిందంటే నీవే దాతవు
తోక లేని వాలిడి మా ఎదుగుదలకి
మా మేను రూప పరిణామ క్రమమని ఎలుగెత్తి చాటావే!!

ఒక తల్లి
ఒక తండ్రి కి పుట్టిన పిల్లల రూపాలే వేరుగా ఉంటున్నట్లు
సామాజిక భౌగోళిక మార్పుల ఉనికి
మనిషి రంగులు ముఖాలు మారావనే సత్యం
నీ సొంతం!!

మెదడు వుండి ఆలోచించని జీవులింకా
ఈ భూమి మీద అంబాడుతుంటే
నెత్తిన ఎక్కి నాట్యం చేసే ఉన్మాది
వ్యవస్థనే భ్రష్టు పట్టించే మార్గం లో

గాడిదలు గుర్రాలు
పిల్లులూ పులులూ
ప్రకృతి ఆటుపోట్లలో
రాటుదేలి బతికిన జీవులు కొన్ని
మరణించినవి ఎన్నో
నీ శోధన
బయో టెక్నాలజీ జెనెటిక్స్ మైక్రో బయాలజీ లకి
దన్ను నేడు
డి ఎన్ ఎ కీ నీవే తొలి గురువు వి తాతా!!

చదవటం తెలీ నోడు
చదువు రానోడు
సైన్స్ ను ఆహ్వానించ లేనోడు
నీ సిద్దాంతాన్ని ఆకళింపు చేసుకోలేడు
నీ కాలంలోనే నిన్ను తప్పు పట్టిన మౌఢ్యం

నూట ఎనభై ఏళ్లు గడిచాకా సైతం
అదే మౌఢ్యం
రూపం మార్చుకుని నీ సిద్దాంతాన్ని
ఒప్పుకోక తప్పిస్తుందే!

కథలే శాస్త్రమని నమ్మింప జూసే మౌఢ్యం
ఎక్కడికక్కడ ఎందుకు ఏమిటి ఎలా ని చంపే నయా కుట్ర
ఎలా అని ప్రశ్నిస్తే ద్రోహం
బ్రూనో హంతకుల తోవలో నేటి మూర్ఖత్వం
ఎవడు ఎవడికి పుట్టాడో తెలియని ముగ్గురి సృష్టి యే
జీవం పుట్టుకని పేట్రేగే తత్త్వం!!

ఏనాటికైనా నీ సిద్దాంతం సజీవం
అదే మానవ మనుగడకు మూల స్తంభం!!
తాతా! డార్విన్!! ఎవడు కాదన్నా
నీవే మానవ జాతి శోధకుడివి!!

– గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో