జ్ఞాపకం- 83– అంగులూరి అంజనీదేవి

“బావగారు లోపల వున్నారా? కారు బయట వుంది?” అడిగాడు.
“లేరు. బైక్ మీద ఆఫీసుకి వెళ్లారు” చెప్పింది సంలేఖ.

మళ్లీ నవ్వాడు తిలక్. నేరుగా శ్రీలతమ్మవైపు చూసి “కారున్నా దాన్ని వాడరు. అదో స్టేటస్ సింబల్లా ఇంటిముందు పెట్టుకుంటారు. కర్లాన్ పరుపు వున్నా మీరు పడుకునేది చెక్కబల్ల మీదనే. పైగా తలకింద కూడా దిండ్లకి బదులు చెక్కలే పెట్టుకుంటారు. బిందెలు, గ్లాసులు వాడుతున్నారా? దాహమైతే ఫ్రిజ్లోంచి ఓ వాటర్ బాటిల్ తీసుకొని అలాగే తాగేస్తారు. ఇక సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్, డ్రస్సింగ్ టేబుల్ అన్నీ మీకు వున్నాయి. ఇంకా ఎందుకండీ సామాన్లు, సామాన్లు అని మా ప్రాణాలు తీస్తున్నారు?” అన్నాడు తిలక్.

“వుంటే నీకెందుకు? లేకుంటే నీకెందుకు? మా డబ్బులు మాకు కట్టి కదులు” కోపంగా రంకెలేసింది శ్రీలతమ్మ.

ఆమెకు బి.పి. పెరిగిందని అర్థమైంది సంలేఖకు.
తిలక్ చేతిని గట్టిగా పట్టుకొని “నువ్విలా మాట్లాడితే నేనిక్కడ వుండాలా వద్దా అన్నయ్యా! కొంచెం కూడా లౌక్యంగా మాట్లాడలేవా? నీ ఆవేశం నీదేనా ప్లీజ్అ న్నయ్యా! నువ్వింకేం మాట్లాడకు” అంటూ బ్రతిమాలింది సంలేఖ.

“వాడినెందుకు బ్రతిమాలతావ్? వాడో పెద్ద రౌడీ! అదిక్కడ చూపించి డబ్బులు ఎగొట్టాలని చూస్తున్నాడు. వాడి నాటకాలు నా దగ్గర సాగవు. వదిలెయ్ వాడిని. మేమేంటో తర్వాత చూపిస్తాం!” అంది శ్రీలతమ్మ.

తిలక్ ని వదిలేసింది సంలేఖ. సంలేఖకు గొడవలు నచ్చవు. పరుషంగా మాట్లాడటం రాదు. అలా ఎవరు మాట్లాడినా తట్టుకోలేదు. ఎప్పుడు కూడా మనసును ఉల్లాసంగా వుంచుకొని, వూహించుకుంటూ రాయడమే తెలుసామెకు. అత్తగారు ఎలా అరిచినా ఆమెతో అంత సౌమ్యంగా వుంటానికి కారణం కూడా తన మనసును ప్రశాంతంగా వుంచుకోవాలనే.

అందుకే శ్రీలతమ్మతో “అత్తయ్యా! మా అన్నయ్యతో మనకెందుకు? మా నాన్న వున్నాడుగా! అన్నయ్య నన్ను చూసిపోవాలని వచ్చాడు. వెళ్ళిపోతాడు. పొరపాటుగా ఏదైనా మాట్లాడితే మన్నించండి!” అంది

“చూసిపోవాలని వచ్చాడా? తినిపోవాలని వచ్చాడా?” కళ్లెర్ర చేస్తూ తిలక్ నే చూసింది శ్రీలతమ్మ.
ఇలా ఎవరైనా మాట్లాడతారా? సంలేఖ ప్రాణం వుసూరుమంది.

తిలక్ కి మండింది. “నేను మీ తిండికోసం రాలేదు. మా చెల్లెలుందని వచ్చాను. ఛఛ.. వట్టి డబ్బు మనుషులు” అంటూ రోషావేశాలతో గుమ్మంవైపు కదిలాడు.

“ఆగు…” అంటూ అరిచింది శ్రీలతమ్మ. ఆగాడు తిలక్.

“నువ్వొక్కడివే ఎందుకు వెళ్లటం? అంత రోషగాడివైతే దాన్నికూడా తీసికెళ్లు. అదిక్కడ వున్నన్ని రోజులు మీ నాన్నదగ్గర నుండి మా డబ్బులు మాకు రావు” అంటూ గొంతు నరాలు తెగేలా అరిచింది శ్రీలతమ్మ.

ఆమెకు వాళ్లు తనని మోసం చేశారన్న బాధ రోజురోజుకి పెరిగిపోతోంది.

ఈ హఠాత్ పరిణామానికి సంలేఖ గుండె జల్లుమంది. రెండు కత్తుల మధ్యన నిలబడి చీరుకుపోతున్నట్లుం దామెకు.

తిలక్ కి తాగిన మత్తు అప్పటికే పూర్తిగా దిగిపోయింది. ఆవేశం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. తీవ్రంగా చూస్తూ “అదేమైనా ప్రాణం లేని బొమ్మనా చంకనెట్టుకొని వెళ్లటానికి? పక్క ఊరులో ఇచ్చుకోకుండా సిటీ మీద మోజుతో ఇంతదూరం ఇచ్చాడే మా నాన్న ఆయనొస్తాడులే దాన్ని తీసికెళ్ళటానికి! ఈ లోపల నా చెల్లెకేమైనా జరిగిందో ఆ తరువాత నీ అంతు చూస్తా!” అంటూ కింద పెదవిని పళ్లకిందకి మడచి కోపంగా వేలు చూపించి వెళ్లాడు.

ఎలాంటి అన్నయ్య అయినా తన చెల్లెలికి అత్తగారి వల్ల ప్రమాదం వుందని తెలిస్తే తిలక్ లాగే స్పందిస్తాడు.

అంతవరకు అచేతనావస్థలో వున్న సంలేఖ అన్నయ్య వెళ్ళగానే గుండెనిండా గాలి పీల్చుకుంది.
తిలక్ బెదిరింపును శ్రీలతమ్మ తట్టుకోలేకపోయింది.

తిలక్ వెళ్లిపోయాక కూడా ”పెళ్ళీ, పేరంటం లేని గాలి వెదవ. వాడు నాకు వేలు చూపించి వెళ్తాడా?” అంటూ కేకలేస్తూనే వుంది. ఆ తర్వాత బి.పి. పెరిగి ఆయాసపడుతూ అక్కడే కూర్చుంది..

ఈ అత్తలెందుకో కోడళ్లని మనుషుల్లా చూడరు. వ్యాపార దృష్టితో చూస్తారు. ఆ తర్వాత పోతూ పోతూ వున్నదంతా కోడళ్లకే వదిలేసి వెళ్తారు. కానీ విషాధం ఏమిటంటే ఆఖరి శ్వాస వదిలేదాకా కోడళ్ల దృష్టిలో రాక్షసులు గానే వుండిపోతారు.

కానీ సంలేఖ శ్రీలతమ్మ ఆయాసపడుతుంటే వెళ్లి టాబ్లెట్ మింగించి నీళ్లు తాగించింది.

                                                                **********
ఊహించనివి జరగడమే జీవితం.

తిలక్ నేరుగా తను పనిచేసే గనుల దగ్గరకి వెళ్లకుండా ఆదిపురికి వెళ్లాడు.
రోడ్డు మీద నుండే “నాన్నా! నాన్నా” అని గట్టిగా కేకలేసినట్లే పిలుస్తూ ఇంట్లోకి వెళ్లాడు.
తిలక్ రౌద్రరూపం చూసి “ఏంటిరా తిలక్! అంత కోపంగా వున్నావ్? ఏం జరిగింది?” అడిగింది సులోచనమ్మ.

రాఘవరాయుడు ఏం మాట్లాడకపోయినా ఏదో కొంపమీదికి వచ్చినట్లే భయపడుతున్నాడు.

రాజారాం స్కూల్ కి వెళ్లాడు. వినీల మాత్రం తన కుడిచేత్తో చీర చెంగుల్ని ఎత్తి పట్టుకొని చకచకా నేలను తన్నినట్లే నడుస్తూ తిలక్ ని చూడగానే ఆగింది. తిలక్ నే చూస్తోంది. ఈమధ్యన భర్త స్కూలుకి వెళ్తుంటే తనే స్కూల్ కి వెళ్లి సంపాయిస్తున్నంత ధీమాగా వుంది వినీలకి. ఎవరు పిలిచినా సరిగా పలకడం లేదు. మనుషులవైపు కూడా చూడటం లేదు. ఆ వీధిలో వాళ్లు కూడా మొగుడికి నడక రాగానే వినీలమ్మ కళ్లు నెత్తిమీదకి చేరాయని చెప్పుకుంటున్నారు.

తిలక్ తల్లి, దండ్రుల వైపు తినేసేవాడిలా చూస్తూ కూర్చున్నాడు.

“కొంపలేదో అంటుకుపోయినట్లు దాని పెళ్లి కోసం వున్న పొలం అమ్ముకొని ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు మీకు రూపాయి ఆదాయం లేదు. అక్కడ మీ కూతురు వాళ్ల అత్తగారి చేతిలో రోజుకో ఏడ్పు ఏడుస్తోంది. ఆ ఇంట్లో నేనే ఓ పదినిమిషాలు కూర్చోలేక పోయాను. అదక్కడ ఎలా వుండాలి?నేనిప్పుడు అక్కడ నుండే వస్తున్నా” అన్నాడు.

 

-– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో