‘చాంగురే
బంగారు రాజా !
పల్లెపాటకు
అద్దిన కావ్య గౌరవం
****
పెద్దరికం
అంటే
అదుపులో పెట్టడం కాదు
అనురాగం పంచడం
*****
దారం
అతని ఆధారం
జీవనాధారం
కరువయ్యిందిప్పుడు
*****
గుర్రాన్ని అదిలించడం
కోపగించడమా !
ప్రయాణంలో
అదీ భాగమే !
*****
లక్ష్యం
నీ ఆయుధమా
ఏ మర ఫిరంగులూ
నిన్ను ఆపలేవు మరి !
*****
ప్రప్రాంచాన్ని గెలిచాడట
అలెగ్జాండర్
కుటుంబాన్ని గెలిపించేది
నాన్నే !
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~