మరలిరాని రోజుల జ్ఞాపకాలు
కొమ్మకు పట్టిన తేనేపట్టులా ఉన్నాయి
కదిలించలేని స్థితిలో నేను
అదుపుచేయలేని ప్రశ్నల వర్షం
కురుస్తూనే ఉంది
ఛత్రం క్రింద ఇమడలేని
కడగండ్లు నేలమీదకు
జరజరా జారుతూనే ఉన్నాయి.
చుట్టూ ఆవరించిన నిశ్శబ్దం
నన్ను వేధిస్తోంది
ఎన్నాళ్ళు ఇలా అని ?
సమాధానాల వెతుకులాటలో
యుగాలు దొర్లిపోతున్నాయి
స్తంభించిన ప్రశ్న మాత్రం
నా చుట్టూ పచార్లు చేస్తోంది
ఏదో సూచన చేస్తూ.
-రాధ కృష్ణ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~