నచ్చడం లేదు…….(కవిత)- చందలూరి నారాయణరావు

ఎందుకో
నాతో మాట్లాడుతుంటే
నాకు నేనే నచ్చడం లేదు….

మనసులో పొర్లే
మాటకు అర్దం నచ్చలేదు…

ఓడిపోతున్న
నిజం గొంతుక నచ్చలేదు

ఒరిగిపోతున్న
నిజాయితీ బలహీనత నచ్చలేదు

ఊపిరాడని
ఊహల మౌనం నచ్చలేదు

అలివికాని
ఆలోచనల లోతు నచ్చలేదు

పిచ్చిగా
పంచుకునే ప్రేమ నచ్చలేదు

మనసును భయపెట్టే
దూరం నచ్చలేదు

మాటకు విలువలేని
దగ్గర నచ్చలేదు..

జవాబు దొరకని ప్రశ్నలా
బతుకు నచ్చలేదు

కలలు కన్న కోరికలే
శత్రువులుగా మారడం నచ్చలేదు

చివరిగా
నీలో నీవు చూపిన
నేను అసలు నచ్చడం లేదు.

– చందలూరి నారాయణరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో