ఆమె ముఖారవిందం
నా ముందు ఒక గ్రంధమైంది
దాన్నెంతో అందంగా
నా చేత చదివించింది
-బషీర్ బద్ర్
మోసం చేసి తాగించాను
ముల్లాకి రెండు గుక్కలు
మునుపు కన్నా నునుపు దేలాయి
ముద్దు ముద్దుగా అతని వాక్కులు
-రియాజ్ ఖైర్ బాదీ
ఓ బాధిత జీవితమా ! ఆగు
ప్రాణ త్యాగం చేయకు నీవు
నీ పరిష్కారం విషం కాదు
నీ ఔషధం మధువు
-హఫీజ్
నన్ను పిచ్చీ ! అని
లాలనగా పిలిచావు
ఈ వెర్రి వాణ్ణి
మరింత ఉన్మాదిగా మనిచావు
-సఫీ షాజహా పురీ
-– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~