వికలాంగుల సేవలో ,హక్కుల కల్పనలో కృషి చేస్తున్న పోలియో బాధిత నైజీరియా మహిళ –లూయిస్ ఆటా(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

నైజీరియా దేశం లోని ప్లాటువా రాష్ట్రం ప్లాటువాలో లూయీస్ ఆబా 29-4-1980 న జన్మించింది .ఆమె ది కుకుం గ్రీడ కగారో కుటుంబం .చిన్న తనంలోనే పోలియో సోకి ,వీల్ చైర్ కె పరిమితమై పోయింది .కానీ మొక్కవోని ధర్యంతో చదువు నేర్చి ,నైజీరియాలోని ఆబుజా యూని వర్సిటి నుంచి డిప్లమో, డిగ్రీ సాధించింది .అమెరికాలోని వాషింగ్టన్ కి చెందిన నెక్స్ ఫోర్డ్ యూని వర్సిటిలో ‘’గ్లోబల్ బిజినెస్ అడ్మిని స్ట్రేషన్’’కోర్స్ చదివింది పాసైంది .

2014 లో ‘యంగ్ ఆఫ్రికన్ లీడర్స్ ఇనీషి యేటివ్’’లో ఉత్సాహంగా పాల్గొని ‘’మండేలా వాషింగ్టన్ ఫెలో ‘’కు ఎంపికయింది .తర్వాత ఆమె సాధించిన విజయాలు కోకొల్లలు .సెడార్ సీడ్ ఫౌండేషన్ స్థాపించి ఎక్సి క్యూటివ్ డైరెక్టర్ అయింది .అబుజాలోని FCTడిజేబుల్డ్ స్పోర్ట్స్ క్లబ్ ‘’కు ప్రెసిడెంట్ అయింది .ఫెడ రేషన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ స్టాఫ్ విత్ డిజబిలిటీస్ మల్టి పర్పస్ కొ ఆపరేటివ్ సొసైటీ ‘’కి బోర్డ్ మెంబర్ గా సేవ లందించింది .’’ఆడ్వొ కసి ఫర్ వుమెన్ విత్ డిజబిలిటీస్ ఇనీషియేటివ్’’ కు అసిస్టెంట్ నేషనల్ కోఆర్ది నేటర్ గా సమర్ధ వంతంగా పని చేసింది ,’’పాటర్స్ గేలరీ ఇనిషియేటివ్’’ సంస్థకు బోర్డ్ మెంబర్ అయి ఉత్తమ సేవలందించింది .’’జాయంట్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ‘’లో సభ్యురాలు .వీటికి మించి ‘’ఎబిలిటి ఆఫ్రికా ‘’అనే అత్యున్నత సేవా సంస్థ స్థాపించి నిర్వహిస్తోంది .’’ఉమెన్ అన్ వీల్స్ మల్టి పర్పస్ కొ ఆపరేటివ్ సొసైటీ ‘’కు ప్రెసిడెంట్ గా మహోన్నత సేవలు అందిస్తోంది .నైజీరియా లోని ‘’మండేలా వాషింగ్టన్ ఫెలోషిప్ ఆల్మిని అసోసి ఏషన్’’ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ .ఇన్ని హోదాలలో తనలాంటి వికలాంగులందరికీ వారి ఉజ్వల భవిష్యత్తు కోసం నిర్విరామంగా విశేష కృషి సేవ అందిస్తోంది మహోన్నత మూర్తి వీల్ చైర్ కే పరిమితమైన లూయిస్ ఆటా.వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదన్న జీవిత సత్యాన్ని అర్ధం చేసుకొని ఆమె సాగించిన ఈ జీవిత యాత్ర అందరికి ఆదర్శం ,ప్రేరణ ,స్పూర్తి .

ఇన్ని పనులు చేస్తూ ,విధులు నిర్వహిస్తూ ఆమె అబూజా మునిసిపల్ ఏరియా కౌన్సిల్ 2019 ,2022లలలో పొటీ చేసింది .ఇంతే కాదు కదూరా స్టేట్ హౌస్ అసెంబ్లి కి కౌరా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం కోసం పోటీ పడింది .కాని దక్కలేదు .ఆమె స్త్రీ కావటం ,వీల్ చైర్ కే పరిమితం అవటం అనే వివక్షత వలన ఓడిపోయింది .కానీ ఆమె అంటే Lois is a young vibrant lady who is very productive, full of life and energy, a role model, brave, courageous, independent, mentor, intelligent, hardworking, and full of ideas.. Lois also represented Thisabled People in drafting Youth Declaration Document for President Buhari Administration in the Pr-Summit Youth Consultation on Youth Development on August 11, 2015 for International Youth Day 2015. We presented the document to President Buhari and I got a handshake from him.కొంత మంది తమ వైకల్యం ను బలహీనత గా ,శాపం గా భావిస్తే, లూయిస్ ఆటా లాంటి వారు మహా శక్తిగా ,దేవుని వరంగా భావించి జీవితాన్ని సార్ధకం చేసుకొని తమలాంటి వేలాది అంగ వికలురకు ఆసరాగా ,ఊతగా ,ధైర్యంగా స్పూర్తిగా ఉంటున్నారు .వారిలో త్యాగం మూర్తీభవించి ఉంటుంది .సేవ ఊపిరిగా ఉంటుంది .

నైజీరియాలో స్త్రీల రాజకీయ భాగస్వామ్యం అతి తక్కువ శాతం అంటే 6 శాతం కంటే తక్కువగా ఉండటం ఆమెను వ్యధకు గురి చేసింది .దీన్ని మార్చటానికే ఆమె కంకణం కట్టుకొని తొలిసారిగా పోటీ చేసింది కాని జండర్ వివక్షత ,వికలాంగత్వం ఆమె కోరికకు అడ్డుపడ్డాయి .ఆమె కుటుంబ సభులు ఆమె ధైర్యానికి ,కోరుతున్న మార్పుకు పూర్తిమద్దతునిస్తున్నారు .తాను ప్రజా క్షేత్రం లో పని చేయాలన్నా ,కొన్ని గ్రామాలకు వీల్ చెయిర్ లో వెళ్ళే అవకాశం కలగనందుకు ఆమె బాధ పడుతోంది .నదులు దాటాల్సి వస్తుంది అప్పుడు అసాధ్యం అంటుంది .రాజకీయంలో మగవారికి స్పాన్సర్లు చాలా మందిఉంటారని తనకు నిధులు కొరత తీవ్రమైన అడ్డంకిగా ఉందని చెప్పింది .వికలాంగులకు భాగస్వామ్యం కల్పించే బిల్ కోసం ప్రయత్నిస్తోంది .అది ఫలవంతమై ఈ మధ్యే బిల్ పాసైంది .దాని వలన మౌలిక సౌకర్యాలకు ,హెల్త్ కేర్ కు ,రవాణా సౌకర్యం కు బాగా ఉపయోగపడుతుందని ఆశా భావం వ్యక్తం చేసింది If I win the elections, I will sponsor bills that provide an enabling environment for persons with disabilities, especially in the area of education. I will also ensure there is a 10 per cent [reserved quotas] in every organization for graduates with a disability.” అని వాగ్దానం చేసింది .అతి త్వరలో ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకొందాం .హాట్స్ ఆఫ్ టు లూయిస్ ఆటా.

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

వ్యాసాలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో