ఆన్ లైన్ లో
పాఠాలు చెబుతున్నాను
బడి వాసన
సోకడం లేదు
***
కాగితం
పదునైన ఆయుధం
మాటలు లేని
మహా యుద్ధం
***
ఊరిప్పుడ
ఉలిక్కిపడడం లేదు
కరోనా పుణ్యమా అని
అంతా ఊళ్లోనే
***
తెల్లకోటుకు
చేతులెత్తి దండం
కరోనా పై
మీపోరు అసమానం
***
నగరం నిద్రపోయి
ఎన్ని రోజులైందో !
లాక డౌన్ లో
లంగ్స్ ఫ్రీ …
***
వరుసలు కడుతున్నరు
భామలు
గుడి మెట్ల మీద కాదు
జిమ్ గేట్లకు
-– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~