అమ్మా!! ప్రీతి!!
నీవు నోరు విప్పితే
సహించలేదు!
నీవు ఎదిగితే ఓర్వలేని సమాజం!
గిరిజన బిడ్డ ఏంటి! డాక్టరేంటి!!
వివక్ష నరనరాన!!
నీవు ఎదిగి వచ్చిన సమాజం
నిన్ను కోల్పోయింది!
నీ సేవలు నీ సమాజం కోల్పోయిందమ్మా!
నువ్వు
నీ సమాజంలో ఎగిసిన తారా జువ్వ
నీ శ్రమ వృథా అయిందమ్మా!
నీ అడుగులు వైద్య విద్యలో పిజి దాకా
నీ నాన్న భుజాలెంత అలసి పోయాయో కదమ్మా!!
నువ్వు అమ్మ తో మాట్లాడిన ఆడియో లో
ఎంతటి పరిణతి!
పిరికితనం లేదా మాటల్లో
ఆత్మ విశ్వాసం ఆచితూచి సభ్యత తో
నువ్వేనా?! ఆత్మహత్య వైపు పయనం!
నమ్మశక్యంగా లేదే!!
ప్రీతీ!
నువ్వే పాలక వర్గ బిడ్డ వైతేనే
నీకు న్యాయం జరిగేదమ్మా!!
హత్యా! ఆత్మహత్య తేలనే తేలదు తల్లీ!
ఈ నేలన అనాదిగా అన్యాయమే!!
నీ దేహం మీద
డబ్బులు వెదజల్లి న్యాయం చేస్తారంతే!
దోషులెవరో తేలదు!!
ఎంతటి విపత్కర పరిస్థితి నెదుర్కొన్నావో!!
మూల వాసుల గొంతుకలు సైతం
రెండుగా వీడి పోయాయి తల్లీ!!
అన్నింటికీ మూలం కులమే మతమే !!
అవి సమాధి అయ్యేదాకా ఇంకెన్ని సమిధలో!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~