ఆమె తన చిత్రం పంపించింది
అణువణువూ అందమే
అంటా బావుంది కానీ
నచ్చనిదల్లా ఆమె మౌనమే
-జలీల్ మానక్ పురీ
ఓ ఆషాఢ మాసపు మబ్బుల్లారా !
కాస్త మోల్లగా కురవండి
నా ప్రేయసి వచ్చేశాక
అప్పుడు జడివానై వర్షించండి
-కతీల్
చంకలో మధు భాండం
పెదవులపై పాన పాత్ర
సాకీ ! ఇదే స్వర్గమంటే
ఏముంది జీవితం ? రెన్నాళ్ళ యాత్ర !
-అసీర్ లఖ్నవీ
ఇంకా కన్నీళ్లేక్కడివి ?
ఈ నిస్ప్రుహలార్పుదామంటే !
చూస్తూ నిలబడిపోయా
నా గూడు తగలబడుతుంటే
-ఎం.ఎ .రజాక్
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~