భావాలన్నీ
దండగుచ్చితే
నానీలయ్యాయి
‘జరీ పూలు ‘మీకే మరి
***
ఆమె నవ్వుల మాటున
వేదనలెన్నో !
సముద్రం
అలలను దాసుకోలేదా !
***
చరవాణి
చేతికి చిక్కింది
వంద మ్,మందిలోనూ
వాడు ఒంటరే
***
చేపలు చిక్కటం లేదు
వలలో
జాలరులు బలి
దళారుల చేతిలో
***
భావాలు ముఖ్యం
భాష కాదు
మనిషి ముఖ్యం
వట్టిమాటలు కాదు
***
వెలిగే దీపాలను
ఆర్పుతున్నారు
అయ్యో !
అది జన్మదినం
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~