ఒకప్పుడు
చింతల తోపు
ఇప్పుడేమో
చీకు చింతల బస్తీ
****
గొడ్డు కోసం గడ్డి వామి
బిడ్డ కోసం
ధ్యానం గాదె
రైతు సమన్యాయం
****
నిన్నటి దాకా
బంధు నాగరికత
మరి నేడో
ఆస్తి కోసం చిందులాట !
****
బిపి , షుగర్లు
అన్నదమ్ములు
డబ్బు , జబ్బు
కావాలా పిల్లలు …!?
— బొమ్ము ఉమామహేశ్వర రెడ్డి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~