ఒకరి జ్ఞాపకాల్లో
కాస్త రెప్పల్ని తడుపుకుందాం !
ఉదాసీన రాత్రుల్లో
ఒన్తరిఆ ఏడ్పుకుందాం !
– బషీర్ బద్ర్
మనసులేని వాళ్లకు ఏముంటుంది మనుగడ ?
జీవించనూ లేరు మరణించనూ లేరు
కలలూ లేవు మెలకువలూ లేవు
ఒక స్పృహ లేదు ఒక సుఖమూ లేదు
-యగాన
నీకు తెలియదా నీ గురించి
నన్ను కూడా అడగవచ్చని
నీతో ఎవరు చెప్పారు ?
నీకో అద్దం అవసరమని
– కలీమ్ మాలీన్
అద్దంలోని ప్రతిబింబాన్ని చూసి
ఇలా అంది ఆ కలికి
అందం మీద పందెం కడతావా ?
రా ! మరి ఇవతలికి
-అమీర్ మీనాయీ
-అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~