డా.హేమలత పుట్ల (1962 – 2019)
తులసి చందు అరుణ గోగులమండ
2023 సంవత్సరానికి రచయిత్రి, వక్త అరుణ గోగులమండ, జర్నలిస్ట్ తులసి చందులకి ‘ డా. పుట్ల హేమలత స్మారక పురస్కారం ‘ ఫిబ్రవరి 9న ఆమె వర్ధంతి సందర్భంగా అందిస్తున్నట్లు మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య వేదిక అధ్యక్షురాలు ఎండ్లూరి మానస తెలిపారు. దివంగత రచయిత్రి పుట్ల హేమలత పేరు మీద 2019 నుంచి తమ తమ రంగాల్లో కృషి చేస్తున్న స్త్రీలకు ఈ పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించారు.
– మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య వేదిక
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~