తెలుగు ప్రచురణ రంగంలో కొత్త ఒరవడి “చదువు యాప్ ” నిర్వాహకులతో ముఖాముఖీ

సాహిత్యానికి సాంకేతికత తోడైతే సాహిత్యాభిలాషులకు పండగే. అదే అద్భుతమైన కార్యానికి ఒక రూపం ఇచ్చారు సాఫ్ట్ వేర్ నిపుణులు సంజయ్, మౌనికలు. తెలుగు ప్రచురణ రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్న ఆన్వీక్షికి సంస్థతో చేరి చదువు అనే ఆప్ ను రూపొందించారు. ఈ కింది లింకు ద్వారా మీ మొబైలు ఫోన్ లో ప్లే స్టోర్ నుంచి చదువు app ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://onelink.to/u9znsh

1. నమస్తే సంజయ్, మౌనిక! చదువు app launch అయిన సందర్భంగా ముందుగా మీకు అభినందనలు. అసలు ఈ యాప్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది?

నేను ఇంజనీరింగ్ పూర్తి చేసేవరకు తెలుగు సాహిత్యం బాగా చదివేవాడిని. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లడంతో తెలుగు పుస్తకాలకు దూరమయ్యాను. ఎక్కడో ఒకటీ రెండు తెలుగు పుస్తకాలు ఎయిర్ పోర్టులో దొరికితే కొని చదివేవాడిని. అలా పదిహేడు సంవత్సరాలు తెలుగు పుస్తకాలకు దూరంగా ఉన్నాను. ఆ బాధలోంచి పుట్టిందే చదువు ఆప్. మన శరీరభాగాలలో ఒకటైపోయిన ఫోన్ లో అన్నీ ఉంటాయి కానీ తెలుగు పుస్తకాలు లేవన్న ఆలోచనతో మొదలైంది కథంతా. ఎక్కడికెళ్లినా మనం ఎక్కడ ఉన్నా మన మూడ్ ని బట్టి రచనలను, రచయితలను ఎన్నుకుని చదవగలిగే అవకాశం కల్పిస్తుంది చదువు ఆప్.

ఈ ఆప్ గురించి తెలుసుకున్న ప్రముఖ సినీ దర్శకులు సుకుమార్ బ్రాండ్ అంబాసిడర్ గా మాకు ఎంతో ప్రచారం చేస్తున్నారు.

ఈ యాప్ ముఖ్యంగా సాహితీ ప్రియులతో పాటు విద్యార్ధులకు, academicians కి చాలా ఉపయోగపడే యాప్. ఇప్పుడున్న పుస్తకాలతో పాటు పిహెచ్డి సిద్ధాంత గ్రంధాలు కూడా చేరబోతున్నాయి.

సంవత్సరానికి 499 రూపాయాలకి వందల రకాల పుస్తకాలు, కథలు, నవలలు, కవిత్వం, ఆడియో బుక్స్, విడిగా కథలు, పత్రికలు మీ చేతిలోనే ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. చదువరులకి అనుకూలంగా font size, డార్క్ మోడ్, లైన్ alignment మార్చుకోవచ్చు. ఇప్పటికే పదివేలమంది subscribers ఉన్నారు. చలం, ఎండమూరి నుంచి నేటి రచయితల రచనల వరకూ చదువులో ఉన్నాయి. ఇక మీదే ఆలస్యం.

2. తెలుగు సాహిత్యం అంతా ఒకే చోట దొరికే ఈ యాప్ లో మహిళా సాహిత్యానికి మీరిచ్చే ప్రత్యేక స్థానం ఏంటి?

స్త్రీ కేంద్ర బిందువుగా ఉన్న రచనలకి, రచయిత్రులకి తెలుగు సాహిత్యం పెద్ద పీటే వేస్తుంది. అలాగే చదువు కూడా. చాగంటి తులసి, వోల్గా, పి. శ్రీదేవి, కె ఎన్ మల్లీశ్వరి, శారద శ్రీనివాస్, కుప్పిలి పద్మ, మన్నెం శారద, ఝాన్సీ కొప్పిశెట్టి, చైతన్య పింగళి, సుజాత వేల్పూరి, సూర్య ధనుంజయ్, కృష్ణ జ్యోతి, ఎండపల్లి భారతి, మానస ఎండ్లూరి, కడలి సత్యనారాయణ…ఇలా పాత తరం నుంచి కొత్త తరం రచయిత్రుల వరకూ చదువులో వారి రచనలు ఉన్నాయి.

3. వర్ధమాన మహిళా రచయితలకు వారి రచనలకు చదువు app subscribers ఎలా స్పందిస్తున్నారు.

పాఠకులంతా subscribe చేసే క్రమంలో లేదా డిసెంబర్ 2022 లో జరిగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో చదువు గురించి తెలుసుకున్నప్పుడు వారికి ఇష్టమైన రచయితలు, రచనలు, ఉన్నాయా అని ఆసక్తిగా వాకబు చేస్తుంటారు. ఎక్కువమంది చదువరులు రచయిత్రుల గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు. వారి రచనలే కాక సంకలనాల కోసం కూడా subscribe చేస్తునారు. మీ టూ, ఇన్ ది మూడ్ ఫర్ లవ్, కొత్త కథ 2018, 2019, పెద్ద కథ ఇలా ఎన్నో సంకలనాల్లో ఉన్న మహిళా రచనలను అందిస్తున్నాం.

4. రాబోయే రోజుల్లో ఇంకేమైనా కొత్త ఫీచర్స్ చదువులో add చేస్తున్నారా?

కవిత్వానికి ప్రత్యేక సెక్షన్ పెడుతున్నాం. మా పాఠకులు కూడా వారికి తోచిన సలహాలు సూచనలు ఇస్తున్నారు. అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆప్ ని ఎప్పటికప్పుడు వినూత్నంగా అందిస్తాం. వాదాలకు సంబంధం లేకుండా అనేక రచనలని అన్నీ వర్గాల వారికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే ప్రతి వారం నాలుగు కొత్త పుస్తకాలు, పత్రికలు, రెండు ఆడియో పుస్తకాలు, సీరియల్స్ పెడుతున్నాం.

అతి తక్కువ ధరకే మీ చేతిలో వందల పుస్తకాలను దాచుకోండి. ఈ అవకాశానికి విహంగకు ధన్యవాదాలు.

మీ  చదువు యాప్  లక్షలాది  చదువరులకి చేరువ కావాలని ఆశిస్తూ , మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

-మానస ఎండ్లూరి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖి, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో