మా అమ్మకు
వంటిల్లె సమస్తం
అదే సుఖదుఖాల
వాస్తవం
***
మబ్బుపట్టిన
మేఘానికి చినుకు
మసకబారిన
మనసుకి చిరునవ్వు
***
ఒంటరిగా ఉండటమంటే
ఒక్కడివే ఉండడం కాదు
నీవు
నీతో ఉండడం
***
ఒక్క చినుకుచాలు
విత్తనానికి
ఒక్క అడుగుచాలు
విజయానికి
***
ఎన్నికల
నగారా మోగింది
ఊసరవెల్లులు
వరుస కట్టాయి
***
కనురెప్పలు
దాటింది కన్నీటి చుక్క…
మరుక్షణమే
మనసు కడిగిన ముత్యం.
-– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~