
ఔను
నా చుట్టూ
ఓ కంచె నిర్మాణం అవసరం
నాకై నేను నిర్మించుకోలేను
క్రోమోజోముల కా శక్తి నిచ్చే
వాక్సిన్ కావాలి
కంచె నా పరిధిలో నా అనుమతి తోనే
నేను బతికినంత కాలం
ఎక్స్ ఎక్స్ యుద్ద విజేత కాగానే
కంచె కూడా సన్నద్ధం అవ్వాలి
ప్రకృతి సృష్టి కి విరుద్ధం గానైనా
చిన్నా లేదు పెద్దా లేదు
నా రూపమే శాపమై
శాసిస్తుంటే
నాకు మరో ప్రత్యామ్నాయం లేదు
నేనో ఎక్స్ ఎక్స్ కారక జన్మ ని
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~