చేతులు బారచాపి, తమతో
లాక్కుని వెళదామని చూస్తారు.
ప్రతిస్పందనలేని కాలమేమో.
ముఖకవళికల్లో ఏ మార్పూ దొరకదు.
మార్చలేని యంత్రాలనూ
ఏమార్చలేని కాలాన్ని చూస్తూ
నిరాశగా వెనుతిరుగుతారు.
కోటల్లో గోడల్లో..
మనుషుల్లో మానుల్లో..
హృదయాల్లో మనసుల్లో..
డొల్లబారుతనమే తప్ప
దయని ఎరుగని రంగస్థలం అది.
ఎత్తుగడలకు, లోకం వంగి
సలాం చేస్తుందనేది
పసిబుగ్గ నవ్వునంటి ఉన్నంత అమాయకత్వం .
పిపాసీ, మరి ఇప్పుడు ఎవరిక్కడ పిచ్చివాళ్లూ.
–అనూరాధ బండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~