అబద్దాన్ని నేను
నిజాన్ని చూపలేని
అసమర్థతగా…..
నిజాన్ని నేనే
అబద్దం చెప్పలేని
అమాయకతగా
* * *
ఒంటరిని నేను
నీతో కలిసున్నా
ఏమి లేమిగా
ఏకాంతం నేనే
నాలో నీవున్నా
నిశిలా కసిగా
* * *
వర్తమానం నేను
బతుకు పంపకానికి
జీవితాన్ని వ్రాస్తూ…
భవిష్యత్ నేనే
ఊహించిన వర్తమానాన్ని
ఊపిరిగా అడుగులేస్తూ….
* * *
ఖాళీ చేతులతో
క్షణం తీరికలేని
నడక నేను
నిండు మనసుతో
నిమిషం ఎడబాటులేని
తలపు నేనే.
-చందలూరి నారాయణరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~