జ్ఞాపకం- 76 – అంగులూరి అంజనీదేవి

ఏం అభిమానులో ఏమో నాకైతే అక్కడ ఒక్కక్షణం కూడా నిలబడబుద్ది కాలేదు. వాళ్ల మాటలు వినబుద్దికాలేదు. దాన్నక్కడే వదిలేసి వచ్చేశాను. ఇలాంటివి మనకి నచ్చవని తెగేసి చెప్పరా! నీ మంచితనం, మెతకతనంగా అనుకొని అది మరీ రెచ్చిపోతోంది. మగవాడివి ఏది తెలిసినా చూసీ చూడనట్లు, వినీ విననట్లు వుండకూడదు. వెళ్లు. వెళ్లి దాన్ని ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. జుట్టుపట్టి నాలుగు పీకినా తప్పులేదు. అందరాడవాళ్లలా వుండమని చెప్పు!అంది.
అతనికి ఆ క్షణంలో తల్లినడిగి కాఫీ కలిపించుకొని తాగాలన్న కోరిక పూర్తిగా చచ్చిపోయింది. ఒక్క వుదుటన సోఫాలోంచి లేచాడు.
లేఖా! లేఖా!అని కోపంగా, గట్టిగా అరుస్తూ సంలేఖ వున్న గదిలోకి వెళ్లాడు.
సంలేఖ సిస్టమ్ ముందు కూర్చుని ఇవాళ ఇంటికొచ్చి తనని కలవని కొందరు జర్నలిస్టుల ఈ మెయిల్ కి తన రెజ్యుమ్ ను, తనకొచ్చిన అవార్డు వివరాలను పాసాన్ చేస్తోంది. ఆలస్యం చేస్తే అది పాత న్యూస్ అయిపోతుంది. అన్ని పేపర్లకి ఒకేరోజు ఆ వార్త వెళ్లాలి. అందుకే చాలా క్విక్ గా చేస్తోంది.
భర్త పిలుపు విని బిత్తరపోయి వెనుదిరిగి చూసింది.
జయంత్ మింగేసేలా ఆమెనే చూస్తున్నాడు. ఆమెకేం అర్థం కాలేదు.
ఏం జరుగుతోందిక్కడ?” అన్నాడు.
అతన్నలా చూడగానే ఆమె మెదడు మొద్దుబారినట్లైంది. అలాగే చూస్తోంది
మాట్లాడవేం?” గద్దించాడు.
మాట్లాడటానికి ఇక్కడ ఏం జరుగుతుందని?” అయోమయంగా చూసింది.
నీకు తెలియదా?” అసహ్యంగా చూశాడు.
ఆ చూపును తట్టుకోలేక తెలియకనేగా అడిగేది?” అంది.
అడుగతావ్! ఎందుకడగవు. నీకసలు ఇంట్లో మనుషుల్ని ఎలా చూడాలో. ఇంటిని ఎలా వుంచాలో తెలిస్తే కదా!అన్నాడు. అతని చూపులు ఎప్పుడూ లేనంత కోపంగా వున్నాయి.
తెలియక నేనేం చేశానని అంత కోపంగా వున్నారు? ముందు అదేదో చెప్పి కోప్పడండి! సస్పెన్స్ దేనికి?” అంది.
ఇవాళ నీకోసం ఎవరెవరో వచ్చారట. ముక్కూ మొహం తెలియనివాళ్లతో నీకు మాటలేంటి? అసలెందుకు రానిస్తావ్ వాళ్లను ఇంటికి?” అన్నాడు.
సంలేఖకు అప్పుడు అర్థమై తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.
మీకు తెలుసుగా నాకు నేషనల్ అవార్డు వచ్చినట్లు! ఆ సందర్భంలో ప్రెస్, మీడియా, వాళ్లతోపాటు ఒక డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ వచ్చారు. వాళ్లంతా నన్ను అభినందించటానికి, ఇంటర్వ్యూ తీసుకోటానికి వచ్చారు. తప్పేంటి?” అంది.
నీకు తప్పులా అన్పించకపోవచ్చు. మాకు తప్పే!అన్నాడు గట్టిగా.
షాక్ తిన్నది సంలేఖ.
ఆ షాక్ లోంచి తేరుకుంటూ చూడండీ! తప్పొప్పులు నాకూ తెలుసు. ఈరోజు మీరనుకున్నంత తప్పేమీ జరగలేదు. వాళ్లేం నాతో గంటలు, గంటలు కూర్చుని చర్చలు చెయ్యలేదు. జస్ట్ ఓ గంట కూర్చున్నారంతే! అలా అని ప్రతిరోజూ వచ్చి నా ముందేం కూర్చోవడం లేదు. అలా కూర్చుంటే నేనే చెబుతాను. మీరేకాదు నాకూ ఒక ప్రపంచం వుంది. మీరిలా రోజు వచ్చి నాతో చర్చలు పెట్టటం సభ్యత కాదుఅని. పైగా మీరొకటి గమనించాలి. రైటర్స్ అంటే పూర్వం సినీయాక్టర్స్ కి వున్నంత గ్లామర్ ఇప్పుడు లేదు. అలా వచ్చి చర్చలు పెట్టేవాళ్లు కూడా ఇప్పుడు లేరు. పైగా ఇప్పుడు నాకున్న సమయాన్ని రాసుకోటానికే వాడుకుంటాను కాని అనవసరంగా వృధా చేసుకోనని మీరు గమనించి మాట్లాడితే బావుంటుందేమోఅంది.
అంటే ఏది బాగో ఏది కాదో నువ్వు నేర్పుతున్నావా నాకు? చూడూ! నువ్వెంత రాసినా నా అంత తెలివి నీకు వుండదని గమనించి మాట్లాడడం నేర్చుకోఅన్నాడు.
నోరు తెరిచి అలాగే చూసింది సంలేఖ.
జయంత్ విసుగ్గా చూసి నువ్వేదో చిన్నచిన్న కథలు రాసుకుంటూ వుంటావని పెళ్లి చేసుకున్నాను కాని, ఇలా తయారవుతావనుకోలేదుఅన్నాడు.
ఎలా తయారయానండీ? ఈ అవార్డు రావాలంటే మాటలా! అక్కడ ఎంత పోటీని తట్టుకొని నా రచనలు ఎంపికయి వుంటాయో తెలుసా? పోనీ సాహిత్యపరంగా ఏ స్థాయికి చేరితే ఇది వస్తుందో తెలుసా? నాకు తెలుసు. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఎంత కృషి చేయాలో, ఎంత సాధన చేయాలో, ఎంత ఏకాగ్రత కావాలో. ఒక్క రాత్రి కాదు, ఒక్క పగలు కాదు. అదో సుదీర్ఘ శ్రమ. దాన్ని మీరు మెచ్చుకోవటం పోయి ఇలా మాట్లాడతారేం?” అంది.
జయంత్ చిరాగ్గా చూసి ఎంతసేపు నీ పిచ్చిగోల నీదేనా? నా మాటలేం పట్టవా నీకు? ఒక్కసారి మన చుట్టుపక్కల ఇళ్లలో వుండే ఆడవాళ్లతో నిన్ను పోల్చుకొని చూడు. నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలుస్తుందిఅన్నాడు.
వాళ్లు హౌస్ వైఫ్ లు. నేను ప్రొఫెషనల్ రైటర్ ని. వాళ్లకీ నాకూ పోలికెలా కుదురుతుంది?”
కుదరనప్పుడు వాళ్లనూ, వీళ్లనూ ఇంటికి రానీయకు. చూసేవాళ్లకి బాగుండదు. మా అమ్మను నువ్వు కొంచెమే చూశావు. తర్వాత నీ ఇష్టం. పర్యవసానాలు బావుండవుఅన్నాడు.
అతని మాటల్లో ప్రేమ లేదు. బెదిరింపు వుంది. ఇలాంటి ఇతని కోసమా తను ఒకప్పుడు నార్మల్ గా చదివి ర్యాంక్ పోగొట్టుకుంది? షాకింగ్ గా వుంది సంలేఖకు. ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు.
అయితే నన్నిప్పుడేం చెయ్యమంటారు? నవలలు రాయొద్దంటారా?”
అది నీ స్వవిషయం. రాయొద్దని నేనెందుకంటాను?” అన్నాడు.
మీరనేది అలాగే వుంది
నువ్వెలాగైనా అనుకో
ఇంకేం మాట్లాడలేదు సంలేఖ.
అతనికి సంలేఖ మాట్లాడకపోవడం వింతగా వుంది.
మాటకు మాట సమాధానం చెప్పే ఆమె ఎందుకలా మౌనంగా వుందో అర్థం కాలేదు.
అలా మౌనంగా వుండకపోతే మీ నాన్న మనకి పెళ్లిలో ఇస్తానన్న సామాన్ల డబ్బుల్ని అడగరాదూ?” అన్నాడు.
ఆశ్చర్యపోతూ ఇంకా మీరా డబ్బుల్ని మరచిపోలేదా?” అంది.
అవి డబ్బులు కదా! మరుపెలా వస్తుంది?” అన్నాడు.
అంటే! వాటిని తీసుకోవాలన్న ఉద్దేశం మీక్కూడా వుందా?” అంది.
అతను మాట్లాడలేదు.
మీరిలా మాట్లాడి నాకు అవార్డు వచ్చిందన్న సంతోషం కొంచెం కూడా మిగలకుండా చేస్తున్నారు తెలుసా?” అంది.
ముఖం అదోలా పెట్టుకుంది.
నాకు మాత్రం సరదానా? అమ్మ పదేపదే అడుగుతోంది. ఆఫీసులో ఓ టార్చర్! ఇంట్లో ఇదో టార్చర్అంటూ ఆ గదిలో వుండకుండా బయటకెళ్లిపోయాడు.
నేషనల్ అవార్డు తీసుకోబోతున్న భార్యతో భర్త వుండాల్సిన తీరు ఇదేనా? సంలేఖకి బాధనిపించింది.
సంలేఖ నేషనల్ అవార్డు తీసుకుంటున్న రోజు రానే వచ్చింది.
ఆమెను జయంత్ బైక్ మీద తీసికెళ్లి రవీంద్రభారతి ఆవరణలో దింపాడు.
అతను బైక్ దిగకపోవటం చూసి మీరూ రండి! మిమ్మల్ని అందరికి పరిచయం చేస్తే నాక్కూడా బావుంటుందిఅంది.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

జ్ఞాపకం, ధారావాహికలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో