ఆకులకీ గడ్డి పరకలకీ
అవగతమే నా దుస్థితి
తోటకంతా తెలుసు గానీ
తెలియనిదల్లా పూలకే నా గతి
-మీర్ తకీ మీర్
నా కన్నీటి కబురు
ఆమె చెవి దాకా ఎవరు చేర్చారు?
నా గుండె గుట్టు నలుగురిలో
ఎవరు సుమా రచ్చ కీడ్చారు?
-నాతిక్ గులావతీ
నువ్వే రానప్పుడు
నీ ఊహల తో పనేంటనీ
దయతో వాటికి చెప్పవూ
వచ్చే శ్రమ తీసుకోవద్దనీ
-జిగర్ మురాదాబాదీ
బుగ్గ మీద ఇవ్వకున్నా
పెదవి మీదైనా పెట్టవా ముద్దు
ఏదో సామెత చెప్పినట్టు
అసలు లేకున్నా కొసరైన కద్దు
-జౌఖ్
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~