ఆస్ట్రేలియా లో ‘తెలుగు పలుకు’ల వాణి – వెంకటేశ్వరరావు కట్టూరి

మరోతరం కోసం మా ప్రయత్నమంటూ నాలుగో వసంతం లోకి అడుగిడుతున్న ఆస్ట్రేలియా తెలుగు పలుకుల వాణి .

“భాష బరువు కాదు మన పరువు” అనే నినాదంతో మూడేళ్ళ క్రితం ఆస్ట్రేలియా లో పురుడు పోసుకుంది మన “తెలుగు పలుకు”ల వాణి.వినండి కొనండి చదివి తరించండి తర తరాల మన తెలుగు చరిత.ముచ్చట గొలిపే తేట తేనియల “తెలుగు పలుకు”అంటూ దేశం కాని దేశంలో శీను జి ఆధ్యర్యంలో దేదీప్యమానంగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దిన దిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది ఈ పత్రిక.ఆస్ట్రేలియా దేశంలో తొలి తెలుగు రంగుల పుస్తకంగా పాఠకులకు అందించబడుతోంది.రాబోయే తరానికి తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిచయం చేస్తూ తెలుగు నుడికారాన్ని, మమరాన్ని పంచుతున్నారు.”తెలుగు సాహిత్య,సాంస్కృతిక చరిత్రలో దక్షిణాంద్ర యుగం ఒక మహోజ్వలమైన ఘట్టం.మధుర,తంజావూరులలో తెలుగు గొప్ప వెలుగును విరజిమ్మింది.తంజావూరు ను ఏలిన నాయక రాజుల వంశంలో అచ్యుత రాయలు ఒక ముఖ్యమైన నాయకుడు.ఈయనకు తెలుగంటే విపరీతమైన ప్రేమ”ఈయన కాలంలో తెలుగు భాష ఎలా వికాసం చెందిందో, నేడు ఆస్ట్రేలియాలో శీను జి సంపాదకత్వం లో ‘తెలుగు పలుకు’ పత్రిక ఆస్ట్రేలియాలో తెలుగువారి చేతుల్లోకి అందించబడుతోంది.

ఎల్లలు లేని తెలుగు పుట.212లో స.వెం రమేష్ గారన్నట్లు”కులం కన్నా మతం కన్నా భాషాజాతి గొప్పదనే సత్యాన్ని నమ్మిన నాడు,తెలుగు నిజమైన వెలుగు లీనుతుంది”అని విశ్వసించే వ్యక్తి శీను జి.’మనం తెలుగు వాళ్ళం.ఎంతో ఘన మైన చరిత్ర కలిగి,మధురమైన భాషను వేల సంవత్సరాలుగా మాట్లాడుతున్నవాళ్ళం.మాతృభాషను నిలబెట్టుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.’అంటూ మాతృభాష పరిరక్షణకు పూనుకున్నారు శీను జి.2019లో తెలుగు పలుకు మాస పత్రికను స్థాపించారు.గత మూడు సంవత్సరాలుగా ఆస్ట్రేలియా దేశంలో పుస్తక రూపం లో అందించబడుతోంది.ఆస్ట్రేలియేతర దేశాలలో ‘ఈ పత్రిక’రూపంలో, అంతర్జాలంలో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు శీను జి.2019లో రెండువందల యాభైమంది పాఠకులతో ప్రారంభమై నేడు ఆస్ట్రేలియా దేశంలో నాలుగువేల ఐదువందల మంది పాఠకులతో తెలుగు పలుకు పత్రిక దిన పత్రిక గా మార్పు చెందింది.ఈ మూడేళ్ళ కాలంలో గణనీయంగా పాఠకులను సంపాదించుకుంది తెలుగు పలుకు పత్రిక.ఆస్ట్రేలియా లో నెలకు 4500 వెబ్సైట్ వ్యూస్,సుమారు 1000 మంది పాఠకులు ఉన్న ఏకైక తెలుగు పత్రిక. ఎంతో నిబద్దత తో మాతృభాషపై మమ కారంతో తెలుగు భాషాభివృద్ధికై శ్రమిస్తున్న శీను జి ని అభినందించాలి.ఆస్ట్రేలియా దేశం లో తెలుగు వారు,తెలుగు సంఘాలు చాలానే ఉన్నాయి.ఆస్ట్రేలియా లో తెలుగు సభలు,సమావేశాలు ఎక్కడ జరిగినా క్షణాల్లో ఆ వార్తా విశేషాలు శీను జి తమ పత్రిక ద్వారా అందిస్తున్నారు.అంతే కాకుండా చిన్న పిల్లలకు తెలుగు డిబ్బి అనే కార్యక్రమం నిర్వహిస్తూ నేటి తరం ఆస్ట్రేలియా తెలుగు వారి పిల్లలకు తెలుగుభాషను నేర్పిస్తున్నారు.భాషోద్యమానికి ప్లకార్డు అక్కర్లేదు. పుస్తకం పట్టుకుంటే చాలు అని నమ్మే వ్యక్తి శీను జి.తెలుగు పలుకు పత్రిక ముఖచిత్రం తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది. కవర్ పేజీపై ముద్రించే చిత్రాన్ని స్వయంగా గీసి డిజైన్ చేసి చక్కటి రంగులతో అందిస్తున్నారు.”స్వభాష స్వగృహం వంటిది”అని గిడుగు రాంమూర్తి గారన్నట్లు ఆస్ట్రేలియా నుండి తెలుగు భాషావ్యాప్తి కి ఎంతో కృషి చేస్తున్నారు.

మధురాంతకం రాజారాం అన్నట్లు”పుస్తకం మనిషి మేధస్సుకు సవాలుగా ఎదుగుతుంది.అదే పుస్తకాన్ని ఎంత గొప్పగా దృశ్యామాన మాధ్యమంగా మార్చినా ఆ పుస్తకానికున్న గొప్పదనం ఆమాధ్యమానికి రాదు.”అది పుస్తకానికున్న గొప్పదనమని నమ్మి తెలుగు పలుకు పత్రిక ను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సకాలంలో శ్రమకోర్చి తెలుగు పలుకులను పత్రిక రూపంలో అందిస్తున్నారు శీను జి.చిన్న పిల్లల మేధా శక్తిని పెంచడానికి పుస్తకాలే ముఖ్యమైన దోహదాలు.తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తెలుగు పలుకు పత్రికను ఆదరిస్తున్నారు.ఈ పత్రికకు శీను జి కుటుంబ సభ్యులుమాత్రమే కాకుండా రామ్ బైరెడ్డి,శ్రీని తుమ్మనపల్లి,భాను మొహమ్మద్,శివ నల్లూరి,రవి బెల్లం కొండ,గౌతం పాలగిరి,శ్రీధర్ పతి,చక్రి వేమూరి,కృష్ణ పచ్చిగోళ్ల,మల్లి కార్జున్ అవిరేణి,సుమ గొలగాని,శశి ప్రఖ్యా,సురేష్ ఘట్టమనేని,ప్రసాద్ మేడి చర్ల,పవన్ నాగ,కార్తీక్ ఉద్దంటి వంటి భాషా ప్రేమికులు ఈ పత్రికకు సేవలందిస్తూ తెలుగు భాషా వ్యాప్తి కి కృషి చేస్తున్నారు. తెలుగేతర దేశంలో తెలుగు భాషను బ్రతికిస్తున్న వీరందరినీ అభినందించాలి. ప్రముఖ అమెరికన్ రచయిత తోరో షేక్స్ పియర్ “వాల్డన్”లో మానవ విజ్ఞానమంతా పుస్తకాలలోనే ఉంది.ఎన్ని సాంకేతిక విప్లవాలు వచ్చినా పుస్తకానికి ప్రత్యామ్నాయముండదు.అన్న టువంటి మాటను మనసా వాచా నమ్మి తెలుగు పలుకు పత్రికను ఆస్ట్రేలియా దేశంలో విస్తరిస్తూ విశేషాధరణతో ముందుకు దూసుకుపోవాలని ప్రతీ తెలుగు వ్యక్తి కోరుకుందాం.జై తెలుగు తల్లి.

– వెంకటేశ్వరరావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో