ఆట……(కవిత)–సుధా మురళి

అంతా
అంతరించి పోతుందా…

ఎన్నాళ్ళ నుంచో ప్రేమ రేణువులను ఏరుకొచ్చి

పదిలంగా కట్టుకున్న ఎద గూడు
బీటలు వారి
నెర్రెలిచ్చి
శిధిల స్థితికి చేరుకుంటుందా…

లేదనీ…
కాదనీ…
ఒక్కమాట చెప్పి పోరాదూ
నీకై నేను వున్నానని, వుంటానని
గట్టు మీద పెట్టలేని ఒట్టు

ఒకటి రాసి పెట్టేందుకు రారాదూ…..

మళ్లీ మళ్లీ నవ్వాలనుకున్న నవ్వులు
వినే నువ్వు లేక బిక్కచచ్చి పోయాయి
వినీ వినీ మురవాలనుకున్న మాటలు
పలికే నీ దగ్గరితనం లేక
అలకల చిలుకలుగా ఎగిరిపోయాయి

క్షణం క్షణం గుర్తొచ్చే
ఏనాటి జ్ఞాపకాలో కన్నీటి వలయాలై

గుండెల్లో సుడులు తిరుగుతున్నాయి

నువ్వెప్పటికీ వుంటానని తెలుసు
నాలో ఇంకిపోని ఆశగా తడి తడిగా మిగిలుంటావనీ తెలుసు
కానీ….
అప్పుడప్పుడూ ఎదురొచ్చే
ఎడబాటు భారాలే నన్ను మెలిపెడుతుంటాయి
నీ దూరాన్ని దుఃఖంగా మార్చి పోతుంటాయి….

-సుధా మురళి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో