జ్ఞాపకం- 75 – అంగులూరి అంజనీదేవి

ఇతరుల్ని చూసి అసూయపడుతున్నామంటే వారికన్నా మనం తక్కువని ఒప్పుకొని బాధపడటమే. కోపగించుకోవటం అంటే మనం విషం మింగి ఇతరుల మరణాన్ని కోరుకోవడం. అవి రెండూ మంచి లక్షణాలు కావుఅంది.
కర్టెన్ చాటు నుండి కోడల్ని తొంగిచూస్తున్న శ్రీలతమ్మ గతుక్కుమంది.
ఇలాంటి కోడల్ని తనకి అంటగట్టిన దిలీప్ ని మింగెయ్యాలన్నంత కోపంగా చూసింది.
వీడి వల్లనే ఈ సంలేఖ తనకి కోడలు అయ్యింది. లేకుంటే తన కొడుక్కి బంగారం లాంటి భార్య వచ్చివుండేది. ఈసారి హస్విత వచ్చినప్పుడు కడిగిపడెయ్యాలిఅని మనసులో అనుకొని కొంచెం తృప్తిపడింది.
దిలీప్ పక్కన డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ కూర్చుని వున్నాడు. అతను ఈసారి తీయబోయే టీవి సీరియల్ ని సంలేఖతో రాయించుకోవాలని వున్నాడు. అది అడగాలనే వచ్చాడతను. సంలేఖ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నాడు. దిలీప్ ని రికమెండ్ చెయ్యమని బ్రతిమాలుతున్నాడు.
అంతలో వేరే ఛానల్ యాంకర్ మైక్ ను సంలేఖ ముఖానికి దగ్గరగా వుంచి ఇప్పుడు వస్తున్న రచనలపై మీ అభిప్రాయం మేడమ్?” అంది.
సంలేఖ ఏమాత్రం ఆలోచించకుండా గంజాయి వనంలో తులసిమొక్కల్లా కొన్ని మంచి రచనలు వస్తున్నాయి. సరైన అధ్యయనం, అవగాహన లేకుండా రాసిన రచనల్లో మాత్రం పరిపక్వత కన్పించడం లేదుఅంది.
పరిపక్వత లేని రచనలు రాస్తున్నవాళ్లకి మీరిచ్చే సలహా?”
తొందరపడి పేరును అచ్చులో చూసుకోవాలన్న కోరికను తగ్గించుకోవాలి. సబ్జెక్టు లోతుల్ని తెలుసుకొని రాయాలి. మనిషి నైజంలో వస్తున్న మార్పుల్ని దృష్టిలో వుంచుకొని సరైన సామాజిక సందేశాలను ఇవ్వాలి. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించే రచనలు చేస్తూ, నైతిక, అనైతిక విలువల్ని చెప్పగలగాలి. అప్పుడే ఆ రచనలు పదిమందికి ఉపయోగపడతాయి. అలాంటి రచనలే చరిత్రలో నిలబడతాయిఅంది.
మీరు రాసే పాత్రలు మీరు చెప్పినట్లే వింటాయా? లేక..అంటూ అర్ధోక్తిగా చూసింది యాంకర్.
వినవు. వాటి స్వభావాలను అనుసరించి అవి వెళ్తుంటాయి. ఒక్కోసారి ఎదురు తిరుగుతాయి
వర్గమాన సాహితీరంగంపై మీ అభిప్రాయం?”
ఎంత లేదన్నా మా సాహితీ ప్రపంచంలో అసూయపరులు ఎక్కువగా వుంటారు. ఒకరి ప్రతిభను ఒకరు మెచ్చుకోరు. ఒకరి రచనల్ని ఒకరు చదవరు. చదివినా చదవనట్లే నటిస్తారు. అందుకే ఎవరికి వాళ్లు రాసుకుంటూ పోతుంటారు.
చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత మహాదేవా! అన్నట్లు రాసుకున్నవాళ్లకి రాసుకున్నంత పేరు వస్తుంది. రాయలేనప్పుడు ఏ పేరూ వుండదు. ఈ ప్రపంచంలో ఏదీ అంత సులభంగా దక్కదు కదా!అంది.
ఆమె చెప్పిన జవాబులు దిలీప్ కి సంతృప్తిగా అన్పించాయి.
ఎక్కడివాళ్లక్కడ వెళ్లిపోయారు. సంలేఖ లేచి తన గదిలోకి వెళ్లింది.
జయంత్ ఆఫీసు నుండి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని ఎప్పుడూ చూడనంతగా ఆత్రంగా ఎదురు చూస్తోంది శ్రీలతమ్మ.
కొడుకు బైక్ దిగి గుమ్మంలో అడుగు పెట్టీ పెట్టకముందే కళ్లు ఇంతింత పెద్దగా చేసి చేతులు అట్లకాడలా తిప్పుతూ అదేదో జాతీయ అవార్డుకు నీ భార్య రాసినవి ఎంపిక అయ్యాయట. ఎవరెవరో వస్తున్నారు. వెళుతున్నారు. ఆడవాళ్లు, మగవాళ్లు అనే భేదం లేకుండా కంగ్రాట్స్అంటూ దాని చెయ్యి పట్టుకొని వూపి మరీ వెళుతున్నారు. వాళ్లలో చాలావరకు నీ వయసువాళ్లే వున్నారు. ఇదేం కర్మరా! ఆ దిలీప్ కి మనమీద ఏం కక్ష వుందని ఈ పిల్లని మన తలకి చుట్టాడు?” అంది.
దిలీప్ పై ఆమె ఎప్పుడూ అంత కోపంగా మాట్లాడలేదు.
మొదటి నుండి దిలీప్ పట్ల ఆమెకు కొంత సానుభూతి, మెచ్చుకోలు వుండేవి.
తండ్రి జూదగాడైనా దిలీప్ మంచివాడురా! బాధ్యతగా అన్పిస్తాడు. వాడి స్నేహాన్ని నువ్వు వదలకుఅనేది.
అలాంటి తల్లి ఇలా మాట్లాడుతుందంటే ఏదో జరగరానిదే జరిగి వుంటుందని నెమ్మదిగా షూస్ విప్పి లోపలికి నడిచాడు జయంత్. అతనికి ఆఫీసులో వర్క్ లోడ్ వల్ల చాలా అలసటగా వుంది. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్లి రిలాక్స్ అవుదామా అని కొన్ని పనులు రేపటికి వాయిదా వేసుకొని వచ్చాడు.
శ్రీలతమ్మ కొడుకును వదల్లేదు.
ఇవాళ మన ఇంటికి మీడియా వచ్చింది. ప్రెస్ వచ్చింది. ఎప్పుడైనా ఈ ఇంట్లో అలాంటి విడ్డూరాలు, వింతలు జరిగాయా? వెళ్లి అడగరా దాన్ని జయా! మామూలుగా కాదు. ఇది ఇల్లా! సంతా!అని గట్టిగా నిలదీసి అడుగు. లేకుంటే అది ఈ ఇంటిని తీసికెళ్లి బజారులో పడేసేలా వుంది. ఇప్పటికే పడేసింది. పేపర్లకి తన పేరును ఎక్కించుకొని రచ్చరచ్చ చేసింది. వచ్చినవాళ్లతో అది మాట్లాడే తీరు, దాని వ్యవహారం చూస్తుంటే అది మామూలు అంశలో పుట్టిన దానిలా లేదు. అమ్మో! అమ్మో! దాని జాతకం ఏం జాతకం రా! ఆ కెమెరాలు, ఆ మైక్ లు, వాళ్లు అడిగే ప్రశ్నలు, అదిచ్చే జవాబులు చూస్తుంటే అది మామూలు మనిషి కాదురా!అంటూ ఒక్కక్షణం ఆగి గాలి పీల్చుకొంది.
జయంత్ నీరసం వచ్చినవాడిలా సోఫాలో కూర్చున్నాడు. అతని మనసంతా పుండులా అయింది.
దాంతో కలిసి బయటకెళ్లాలంటేనే తలనొప్పిగా వుంది జయా! మొన్న వెళ్లినప్పుడు ఏం జరిగిందో తెలుసా?” అంది శ్రీలతమ్మ.
వెంటనే ఏం జరిగిందో త్వరగా చెప్పు అన్నట్లు చూశాడు జయంత్. అతనికి అసహనంగా వుంది..
ఎవరో చదువుకుంటున్న అమ్మాయిలట. దాన్ని చూడగానే గుర్తుపట్టి వావ్! మీరు రైటర్ కదా! నెట్లో మీ సీరియల్ చదువుతున్నాం. అందులో మీ ఫోటో పరిచయం వుంది. ఆ సీరియల్ నిజంగా కేక మేడమ్! అదిరిందిఅంటూ దాని చేతులు పట్టుకొని వత్తి వత్తి వదిలారు. అప్పటిగ్గాని వాళ్ల అభిమానం తీరలేదు. ఇదికూడా వాళ్లను చూడగానే చిన్నపిల్లయిపోయింది. అదేం మైకమో ఏమో చుట్టూ ఎవరున్నారో కూడా పట్టించుకోవటం లేదు. దాని రచనలపై ఒకటే చర్చ. అప్పుడు దాని ముఖంలో ఆనందం చూడాలి. ఆ తర్వాత ఎప్పటికో తేరుకొని నావైపు చూసి ఈవిడ మా అత్తగారుఅంటూ వాళ్లకి నన్ను పరిచయం చేసింది.

(ఇంకా ఉంది)

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో