ఓ నెలవంకా…! (కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి

ఈరేయి ఇలా ముగిసిపోతే బాగుణ్ణు
రేపన్నది లేకుండా
ఉహించని కెరటం
హఠాత్తుగా
నా నుండి లాక్కుపోయింది
బండ సంధులలోనుండి
కరిమబ్బులలో కరిగి
కలిసి ఏకధాటిగా కురిసే
నాకన్నీటి సంద్రం
అలా ప్రవాహంలో
కలిసిపోతే ఎంత బావుణ్ణు
ఓ నెలవంకా !
చకోరంలా నిను అల్లుకుని
వెండి వెన్నెల్లో ఆడుకున్నా
ఊహల ఊయలలో
క్రౌంచ పక్షిలా నీజతగా
కలిసుండలేకపోయాను
నా స్వయంకృతాపరాధమే
ఈ మనోవేదన మరణమే కదా
ఓ చంద్రతారా
నా సితారా
నీరూపు నలుపు
నీ మనసు మరుమల్లెల తెలుపు
చేజేతులా
నిను చేజార్చుకున్నా
అమాసచీకటిలో
గాడాంధకారంలో
ఇక నా జీవితంలో
వెలుగురేఖలు లేవు
కటిక చీకట్లే
కన్నీటి సెలయేటి ధారలే…

 

-వెంకటేశ్వరరావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో