కుటుంబం(కథ) – బి .వి. లత

గేటు చప్పుడుకి కిటికీలోంచి చూసిన రాజ్యానికి రాజారాంగారు కనుపించారు. పడక గదిలోకి చూస్తూ “ఏమండీ, బావగారొచ్చారు’ అంటూ వీధి గుమ్మం తలుపులు తెరచి ఆయనను సాదరంగా లోపలకు ఆహ్వానించి, ‘అంతాకుశలమేనాండి’ అంటూ ఆయన చేతి సంచీ అందుకుంది.

‘ఆఁ, అంతా కులాసేనమ్మా, రఘు లేడా ఇంట్లో?’

‘ఉన్నారు, స్నానానికి వెళ్ళారు. ఇదిగో, మంచినీళ్లు

తీసుకోండి,’ అంటూండగానే రఘురాం వచ్చాడు.

‘ఎలా ఉన్నారన్నయ్యా? అమ్మ ఎలా ఉంది?’

‘అంతా కుశలమేరా! చిన్న పనుండి వచ్చాను. నీకు శలవేగా?’, ‘రెండవ శనివారంగా, శలవే’.

రాజ్యం ఇద్దరికీ వేడిగా ఇడ్లీలు కొబ్బరి పచ్చడితో ఉన్న పళ్ళాలు అందించింది. తింటూ అన్నదమ్ములు పిచ్చాపాటీమట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పిల్లలు రమేష్, రవళీ ప్రయివేటునుంచి వస్తూనే ‘ పెదనాన్నా, నాకు లెఖల్లో పదికితొమ్మిదొచ్చాయని’ రమేషంటే, ‘నాక్కూడా పెదనాన్నా’ అంటూ రవళి వంత పాడింది. ‘నాకు తెలుసమ్మా, అందుకే మీకుమిఠాయిలు తెచ్చా, వెళ్ళి తీసుకోండి.’

“రఘూ, శాంతారాం దగ్గరకి వెళ్ళాలిరా” ,

“అలాగే, భోజనం చేసి సాయంత్రం అలా వెళ్దాం, వాడికి ఫోను చేసి చెబుతాను. ఇంతకీ, విషయమేమిటి?”,

“అదే మొన్న ఒక రోజు మన సుచిత్ర వచ్చింది. అది నన్ను ఒక సాయం అడిగింది. అది తను ప్రేమించిన మనోహర్గురించి చెప్పి, సీతారాంని, కాంతామణిని వప్పించే బాధ్యత నా మీద పెట్టి, బతిమిలాడింది. వాళ్ళు మనవాళ్ళు కాదు, ఒక్కసారి కలిసి మాట్లాడాలి. ముగ్గురం వెళ్ళి చూసి, మనకు నచ్చితే వాడిని వప్పిద్దాం”,

అంతా వింటున్న రాజ్యం “అదేమిటి బావగారూ, మనవాళ్ళు కాదన్నప్పుడు, తనకి నచ్చ చెప్పలేదా?”.

“చెప్పాల్సినవి చెప్పాను, కానీ కోప్పడ లేదు. మన వాళ్ళనీ మంచి వాళ్ళనీ సునయననిచ్చి చేశాము. ఏమయ్యింది? దానిజీవితం నాశనమయ్యింది. ఇప్పటికీ దానిని చూస్తే నాకు, కృష్ణవేణికి బాధగా ఉంటుంది. అది మెడిసిన్ చదవాలని ఎంతోఆశపడింది. నేనే వినలేదు. వాళ్ళు నరకమంటే ఏంటో చూపించారు దానికి. పోలీసుగా సీత, లాయరుగా శంతా సాయంచేసి దానినీ, దాని కొడుకుని బయట పడేశారు. అందుకే పిల్లల మాటకు కూడా విలువిస్తే తప్పేమిటని బయలుదేరివచ్చాను.” “సునయనది దురదృష్టం బావగారు. అందరికీ అలా ఎందుకవుతుంది?

“అది నిజమేననుకో, అలా కాకూడదనే, సుచి, చదువుకన్నదీ, తెలివైనదీ, దాని జీవితానికి సంబంధించిన విషయం, ఆలోచిస్తే తప్పేమిటనిపించింది.”

“అదీ నిజమేలే, అన్నయ్యా, అలాగే, ఒకసారి కలిసి వద్దాం భోజనాలయ్యాక శాంతారాం ఇంటికి వెళ్దాం”.

సాయంత్రానికి శంతారాం ఇంటికి చేరారు అన్నదమ్ములు.

                                                                                               ***

శాంతారాం ప్రభావతికి కవలలు కారుణ్య, కైవల్య. పెదనాన్నలని చూస్తూనే ఆటలొదిలి పరిగెత్తుకొచ్చారు. వాళ్ళకోసంతెచ్చిన మిఠాయిలు వాళ్ళకిచ్చి, ఎత్తుకోని ముద్దు చేస్తూ ఇంటిలోకి వచ్చే అన్నలకి ఎదురొచ్చాడు శాంతారాం. ‘నాకు సైకిల్కావాలి పెదనాన్నా’ అనే కారుణ్య అర్జీకి, ‘ నాకు కూడా పెదనాన్నా’ అంటూ గారాలు పోయింది కైవల్య. ‘అలాగేనమ్మా, ఒరేయ్ శాంతా ఈ సారి నేను వెళ్ళేలోపు వీళ్ళకు కొనేద్దాం రా’ అనే రాజారాంగారికి, నవ్వుతూ ఎదురొచ్చిన ప్రభావతి ‘ వాళ్ళలా అడుగుతూనే ఉంటారండీ, మీరు కనిపించగానే, ఏయ్, మీరిద్దరూ ఆడుకోండి, పొండి. అత్తయ్యా, అక్కయ్యాఎలా ఉన్నారు?’

“అంతా బాగానే ఉన్నారు. కృష్ణకే షుగరు, బీపీ కంట్రోల్ లోకి రావట్లేదు. రాంచరణ్ కొన్నాళ్ళన్నా తన దగ్గరకి వచ్చిఉండమని ఒకటే గొడవ. తనకెక్కడ కుదురుతుంది?’

“ఎందుకు కుదరదండీ, అత్తయ్యను ఇక్కడ దింపి, మీరిద్దరూ కొన్నాళ్ళు ఉండి రావచ్చు కదా? అభిరాంతో సరదాగాకొన్నాళ్ళు గడిపితే అక్క ఆరోగ్యం కూడా మెరుగవుతుంది, వాళ్ళకూ తృప్తిగా ఉంటుంది.’

“అవునన్నయ్యా, అలా చేయచ్చు కదా? అమ్మ కొన్నాళ్ళు మా దగ్గర ఉంటే ఆమెకీ మార్పుగా ఉంటుంది’ అనే రఘురాం తో“అలాగేలేరా, ఆలోచిద్దాంలే, ముందర ఇది కానీయండి.”

తర్వాత రాజారంగారు, శాంతారాంకు, ప్రభావతికి సంగతి వివరించాక. “బాగానే ఉందన్నయ్యా, ఇప్పుడు చీకటయ్యిందిగారేపు టిఫిన్లయ్యీక బయలు దేరుదాం. ఎంతైనా గంట పోను గంట రాను పడుతుంది, నువ్వేమంటావ్ “ అన్నాడురఘురాంని చూస్తూ.

“అది నిజమే, రేపైతేనే బాగుంటుంది. నేను వెళ్ళి రేపుదయమే వస్తాను.”

“రేపు అక్కనీ పిల్లలనీ కూడా తీసుకు రండి. పిల్లలిక్కడ ఉంటారు. అక్క మీతో వస్తారు. ముగ్గురరెళ్ళకూడదు కదా?” అందిప్రభావతి రఘురాంనుద్దేసించి.

“ అదీ నిజమేరా, మనకు కనిపించనివి ఆడవాళ్ళు ఇట్టే పట్టేస్తారు” అన్నారు రాజారాంగారు.

నవ్వేసి, “అదీ నజమేలే, అలాగే చేద్దాం” అన్న రఘురాంతో,

“బ్రేక్ఫాస్టు ఇక్కడ చేయిస్తా, వంట మనిషుందిగా, అక్కనేం పెట్టుకోవద్దనండి”

“సరే, అయితే, రేపుదయమే వస్తానంటూ”, వంటమనిషిచ్చిన పకోడీలు, టీ తీసుకుని బయలు దేరాడు రఘురాం.

అనుకున్నట్లే ఉదయానే రఘురాం వాళ్ళు వచ్చేశారు. వారి కోసమే ఎదురు చూస్తున్న పిల్లలు అన్నకి అక్కకీ ఎదురువెళ్ళారు. రమేష్, తన వీడియో గేమ్ తమ్ముడికి చూపిస్తూ నీకు నేను నేర్పిస్తానంటూ తీసుకువెళ్ళాడు. రవళి తన కామిక్పుస్తకాలు చెల్లెలికి అందిస్తూ, మనం చదువుకుందాం రా అని లోపలికి తీసుకెళ్ళింది. ‘రండక్కా, పోయిన వారం మేమేఅటొద్దామనుకున్నాం, పిల్లలకి పరీక్షలన్నారని రాలేదు.”

“అవును ప్రభా, నీకు తెలియందేముందీ, రవళి ఫరవాలేదు కానీ వాడిని పట్టించుకోకపోతే , ఆటల్లో పడిపోతాడు.”

“ధాంక్యూ, పిన్నీ, థాంక్యూ బాబాయ్, కోహ్లీ సిగ్నేచర్ బాట్, వావ్.” అంటూ పైనుంచి అరస్తూ వచ్చాడు రమేష్.

‘కారుణ్యా, ఇప్పుడు కాదన్నానా?”అనే తల్లికి

“ఊరికే, చూపించా, మమ్మీ,”

“ఓకే, ఇప్పుడాడనులే, పిన్నీ, హాలిడేస్ లో”

“నీకు మంచి మార్కులొస్తే, బాబాయి నిన్ను టెస్టు

మ్యాచ్ కు తీసుకెళదామనపకుంటున్నారు, చూసుకో, మరి”.

“బెంగుళూరా? కలకత్తానా? ఎక్కడికి?”

“బెంగుళూరు, అక్కడ శ్రీధర్ మామ ఉంటాడు కదా?”

“అవునా? సరే, బాగా చదువుతాను, మాట తప్ప కూడదు బాబాయి, రా కారుణ్” అంటూ తమ్ముడితో పైకి వెళ్ళిపోయాడు.

“మొన్న సునయన కూడా బెంగుళూర్లో ఏదో ఇంటర్వ్యూకని వెళ్ళింది. జాబ్ వచ్చేట్లుందని చెప్పింది” అనే రాజారాం తో

“ అవునా? నేను నిన్ననే మాట్లాడాను, చెప్పలేదే?” అంది ప్రభావతి.

“నాకు చెప్పిందిలే, నేను నీకు చెప్పటం మరిచిపోయాను” అన్నాడు శంతారాం.

తోడికోడళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ సర్ది బ్రేక్ఫాస్టు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

“ప్రభా, నువ్వుకూడా, రావచ్చుగా, సాయంత్రానికి వచ్చేస్తాం, పిల్లల్ని ఆయా చూసుకుంటుంది.”

“లేదక్కా, నిజానికి ఒక క్లయింట్ రావలసి ఉంది. మా ఇద్దరిలో ఎవరో ఒకరం ఉండాలి.”

“ఇంతకీ ఏం చేయాలి నేను? నీకు తెలుసుగా కాంతామణక్కతో పని”.

“అవును, ఆమెకి నాలిక పదునెక్కువ, గమ్మున ఏదోకటి అనేస్తారు. అయినా ఏం చూస్తామక్కా? పిల్లవాడు వాళ్ళమ్మతోఎలా ఉన్నాడో చూడు, సాధారణంగా తల్లికి సాయంగా ఉండి ఆప్యాయంగా ఉంటే, భార్యని కూడా బాగాచూసుకుంటాడంటారు. తల్లి అందరినీ అదిలిస్తోందా? సరదాగా ఉందో చూడండి, ఇల్లాలిని బట్టేకదా ఇంట్లో పరిస్థితితెలిసేది?”

“అవును, అదీ నిజమే కదా, సరే, అలాగే చేస్తాను.”

టిఫిన్ కానిచ్చి శాంతారాం కారులో బయలు దేరారు.

                                                                                                          ***

రాజారాంగారిచ్చిన అడ్రస్ అడ్రసు ప్రకారం వారు సిద్దిపేట నానుకుని ఉన్న ఒక గ్రామం చేరుతున్నారు. మిషన్ భగీరథధర్మమా అనో ఏమో కానీ, ఊరంతా పచ్చటి పంట పొలాలతో కళకళలాడుతోంది. గుడి ఎదురు సందు లో చివరి ఇల్లనిచెప్పటంతో సులువుగానే గుర్తు పట్టారు. దాదాపు అర ఎకరం స్ధలంలో ఉన్న అధునాతన భవనం. చుట్టూ రకరకాల పళ్ళచెట్లు, ఒక ప్రక్క పూల తోట, ఒక ప్రక్క కూరగాయల మళ్ళు. గుమ్మానికి ప్రక్కగా ఉన్న ట్రాక్టర్‌ను ఎవరో మరమ్మత్తులు చేస్తూకనిపించారు. శాంతారాం కారు దిగి తలుపు తీసుకుని లోపలికి వచ్చి “సదానందంగారు ఉన్నారాండి? “ అనగానే, “నాన్నగారు మీకోసమెవరో వచ్చారు” అంటూ వెనక్కు తిరిగిన మనోహర్ “అంకుల్, మీరా” అంటూండగానే, ట్రాక్టర్వెనకనుంచి “ఎవరూ?” అని వచ్చిన సదానందానికి, “సుచిత్రా వాళ్ళ బాబాయి”,

“ ఓ! రండి,

 

– బి .వి. లత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో