దొరల గడీలను ఎదిరించిన “బందూక్ ”(పరిశోధక వ్యాసం )- నాగేంద్ర గడ్డం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవాలనుండి ఆనాటి సమాజం దొరల ఏలుబడి, వెట్టిచాకిరి, సాంఘిక స్థితిగతులు,స్త్రీలపై అకృత్యాలు , దౌర్జన్యాలు సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో కష్టాలను మన కళ్ళకు కట్టినట్టు బందూక్ నవలలో కందిమల్ల ప్రతాపరెడ్డి సహజ రీతిలొ రచన చేశారు .

పరిచయం :

ఈ నవలలో రచయిత స్వీయ అనుభవాలు ఆనాటి సమాజంలో ఉన్న సామాజిక అంతర్గతలను సరైన పాత్రలను సృష్టించి పాత్రల మనో భావాలు ద్వారా వారు పడుతున్న మానసిక శారీరక సంఘర్షణ ఉద్వేగ భరితంగా నవల రచన కొనసాగించాడు.

రచయిత కందిమల్ల ప్రతాప్ రెడ్డి నల్లగొండ జిల్లా జొన్నలగడ్డ గూడెం లొ జన్మించారు. ప్రాథమిక విద్య గ్రామంలోని ఖాన్గి బడి లో చదివారు అనంతరం విద్యార్థి దశ నుంచే సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు.అప్పటి నుండే విప్లవ చైతన్యభావాలు కలిగిన వ్యక్తిగా ఎదిగారు . 1952 కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీలో ఎన్నో పదవులు పొందారు, గ్రామీణ పేద ప్రజల తరుపున పోరాడారు, గిరిజనుల కోసం ఉద్యమాలు కూడా చేశారు. ఈ రోజుల్లో సాయుధ పోరాటం అవగాహన పొందడానికి బందూక్ నవల చాలా ఉపయోగపడుతుంది. సాయుధ పోరాట నేపథ్యం చరిత్ర ఈ నవలలో అంతర్లీనమై ఉన్నది.
కందిమల్ల ప్రతాప్రెడ్డి గారు రాసిన నవలలో బందూక్ మొదటిది .ఈ నవలను1996 జూలై చతుర సంచికలో సంక్షిప్త రూపంలో ప్రచురించారు. అనంతరం ఈ నవలను చదివిన పాఠకులు సాయుధ పోరాట చరిత్ర సామాజిక స్థితిగతులు గురించి చాలా విషయాలు అవగాహన చేసుకున్నారు. సాయుధ పోరాటంలో సంఘం పాత్ర అందులో ఉన్న కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న దొరలను ఎలా ఎదిరించారు అనే విషయాలు సజీవ పాత్రల ద్వారా మన కళ్ళకు కట్టినట్టు సహజమైన తెలంగాణ మాండలిక పదాలను వాడుతూ పాఠకులకు చదివే ఆసక్తి కలిగేలా రచన కొనసాగింది.దీనికి లభించిన పాఠకాదరణ దృష్ట్యా 2006 సంవత్సరంలో సంపూర్ణ నవలగా ప్రజాశక్తి బుక్ హౌస్ ద్వారా బందూక్ నవల మొదటి ముద్రణ పొందింది.

బందూక్ నవల కథ, వస్తువు:

ప్రతాప్ రెడ్డి గారి బందూక్ నవలలో నిజాం ప్రభుత్వ పరిపాలన , రజాకార్ల దౌర్జన్యాలు ,సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రజల ఆలోచన విధానాన్ని రైతుల పోరాటపటిమ ,కమ్యూనిస్టుల పోరాటం వాళ్లు ఆచరించిన సిద్ధాంతాలు గెరిల్లా యుద్ధ పోరాటాలు గురించిన విషయాలు ఈ నవల ద్వారా పాఠకులకు స్వయంగా పాల్గొన్నట్లు అనుభూతినీ కలిగించారు.

ఈ నవలలో వస్తువు ,రూపం నిజాం ప్రభుత్వ పాలన వ్యతిరేకిస్తున్న రైతులు ,వెట్టిచాకిరి చేస్తున్న ప్రజలు సంగం కార్యకర్తలతో కలసి పోరాడిన సన్నివేశాలను ప్రధాన వస్తువు బందూక్ నవలలో తిసుకున్నారు. కథ ప్రధానంగా సాయుధ పోరాట సందర్భంలో జరుగుతున్న అన్యాయాలను గ్రామాల్లో ప్రజల వెట్టిచాకిరీని దొరలు నిజాం ప్రభుత్వం రజాకార్ల మద్దతుతో సంఘం నాయకులను హింసించే సన్నివేశాలను ఉద్వేగ భరితంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. నవలలో నిజాం ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఎదురుతిరిగిన సాయుధ రైతాంగ పోరాటం లో తమ ప్రాణాలకు తెగించి పోరాడిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. దొర , దొరసాని గడీల పాలన లో స్త్రీలపై జరుగుతున్న ఆకృత్యాలు, దారుణ శిక్షలు, హింస ,బందూక్ నవల లో ప్రధానంగా ఉన్నాయి. నవల చదువుతున్నంత సేపు అక్కడక్కడ కన్నీటి పర్యంతమయ్యే సంఘటనలు ఉన్నాయి. ఇందులో ఫ్యూడలిజాన్ని ఎదురించిన సంఘటనల ద్వారా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రధాన వస్తువుగా బందూక్ నవల రచన సాగింది .
నవలలో వస్తు శిల్పాలు, పాత్రలు వాళ్ళు ఉపయోగించే తెలంగాణ సహజ మాండలికం ఉర్దూ-తెలుగు కలిపి మాట్లాడే పదాలు, కథలో ఒక సున్నితమైన ప్రేమను అంశంగా తీసుకొని సాయుధ పోరాట లలో వారి ప్రేమ రాబోయే తరాలకు సుఖశాంతులతో జీవించాలని దానికోసం తమ ప్రేమ త్యాగం చేసందుకు సిద్ధపడిన రవి, శకుంతల పాత్రలు సజీవంగా చిత్రించబడ్డాయి.

నవల విశేషాలు:
.
ఇందులో ప్రధాన కథ అంత కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న నల్గొండ జిల్లా లోని ధర్మపురం అనే గ్రామంలో జరిగిన సంఘటనలు, అక్కడి దౌర్జన్యాలు, దొర పాలన నవలలో ప్రధాన వస్తువుగా తీసుకొని సాయుధ పోరాటంలో ప్రజలు పాల్గొన్న తీరును చూపించారు.
నవలలో చెప్పబడిన ధర్మపురం గ్రామంలో దొర గడి ఉంది అందులో దొర భాస్కర రావు ,వెట్టిచాకిరి పనివాళ్ళు ,నౌకర్లు ఉండేవాళ్ళు . గ్రామంలో దొర మాట అంటే దానికి తిరుగులేదు . దొరకు ఎవరు ఎదురు తిరిగే వాడే లేడు . అక్రమ మార్గాన గ్రామంలోని ప్రజలు దగ్గర సంపాదించిన భూమి, జనం దగ్గర ఉన్న పాడి పశువులను లాక్కొని తన ఆధీనంలో ఉంచుకున్నారు. దొర చేసే ఆకృత్యాలకు మద్దతుగా ఆ గ్రామంలో భూస్వాములు ,పట్వారి రామారావు , షావుకారు వెంకయ్య కూడా ఉన్నారు.

దొర భాస్కరరావు భూ స్వాములు ను చాల ఇబ్బందులు గురిచేసి వారి భూమి లాక్కునేవాడు . ఈ గ్రామంలోని మిగతా వృత్తి కులస్తులు దొర గడిలో పొలాల్లో ఊడిగం చేయాల్సి ఉండేది. ఎవరయినా ఎదురు తిరిగితే ఇక వాళ్ల పని అంతే.దొర భాస్కరరావుకు ఇద్దరు భార్యలు పెద్ద ఆమె జానకమ్మకు పిల్లల్లేరు అందుకే తనకు వరుసకు చెల్లే సుభద్రమ్మ దొర వయసులొ సగం ఉంటుంది. దొరకి పెళ్లి చేసింది. ఇంక వేరే వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటే తనపైన అధికారం చేలాయిస్తరని ఆమె భయం.

ఇక ఆ గ్రామంలో జరిగే భార్యాభర్తల మధ్య తగాదాలు ,ఆస్తి తగాదాలు, ఇలా అన్ని విషయాలు పెద్ద దొరసాని జానకమ్మ పంచాయతీ పెట్టి శిక్షలు, జుర్మానలు వేయించేది.ఆనాటి పరిస్థితుల కనుగుణంగా రచయిత దొరలు ప్రజలను ఏవిధంగా హింసించేవారో కొన్ని సంఘటనలు ద్వారా తెలియపర్చాడు . గ్రామంలో గడి ఎదురుగా ఓ యువకుడు దొర ముందునుండి వెళ్తు చెప్పులు వేసుకున్నాడు అనే నెపంతో వాడిని చచ్చేలా కొట్టడం చుస్తే దొరల అహంకారం తానే అందరికి సర్వాదికారిని అనే గర్వం తో ఎదురు తిరిగిన వాళ్ళని అణచివేసేవాడు . దొరసాని రోజూ ఒక్క పంచాయతీ లేనిదే కాలం గడిపేది కాదు. గ్రామంలో దళితులపై చేసిన అరాచకాలు చాలానే ఉన్నాయి. షావుకారు వెంకయ్య దగ్గర చేసిన అప్పులకు వడ్డీల మీద చక్రవడ్డీలు వేసి షావుకారు పొలంలో బాకీ తీర్చినందుకు వాళ్ల జీవితాంతం తన పొలం లోనే ఊడిగం చేయాల్సి వచ్చేది. దీనికి దొర మద్దతు కూడా ఉండేది. దీని కాదని ఎవరైనా ఊరు విడిచి వెళితే అతని పై వేసే శిక్షలు జరిమానాలు అన్నీ ఇన్నీ కావు. ఈ బాధల కన్నా చావడం మేలనుకునే వారు ప్రజలు. వీరి బారిన పడిన వాళ్ళను కొట్టడానికి దొర నౌకర్లు షేత్ సింగ్ కొండడు , రామిగాడు ఉండేవాళ్ళు . రచయిత ఈ నవల్లో గ్రామంలో ఉన్న ప్రజలను దొర రక రకాల గుండు రాళ్ళూ ,బరిగెలు కర్రలు,తాళ్లు కొరడాలు వాడి హింసించే సంఘటనలు కనిపిస్తున్నాయ్. అదే గ్రామంలో ఉన్న పటేల్ పాపిరెడ్డి గ్రామంలో వయసులోఉన్న ఆడవాళ్లను లొంగదీసుకోవడం , చెరచడం పాపిరెడ్డికి ఎదురుతిరిగితే వాళ్లని ఏదో ఒక నెపంతో పంచాయతీకి ఇడ్చేవాడు. అలా గ్రామంలో అతని వాళ్ళ బలైన ఆడవాళ్లేందరో ఉన్నారు. గడి ల పాలనలో లో గ్రామం లో కొత్తగా పెళ్లి ఆయన కోడలు బయట తిరిగితే ఏ పటేల్ కళ్ళలో పడ్తాదో అనే భయం అప్పటి వాళ్ళో ఉండేది .లచ్చుమమ్మను వాళ్ళ అమ్మగారి ఇంటినుండి తీసుకొస్తున్నపుడు వాళ్ళ మామ తీసుకున్న జాగ్రత్తలు చుస్తే ఏ పటేల్ ,దొర కంట్ల పడొద్దు అనే భయం గ్రామాల్లో ఉండేది. అని తెలుస్తుంది .

దొర గడిలో చిన్న దర్వాజ నుండి రోజు వృత్తి కులాల వారు వంతులవారీగా కోళ్ళు, మేకలు , వంట సామానులు, విస్తరాకులు, కల్లు కుండలు, తీసుకు రావాల్సిన పరిస్థితి ఉండేది.ఈ పనికి ఎవరైనా ఎదురు తిరగడంటే శిక్షలు గ్రామ బహిష్కరణ చేసేవారు. రచయిత ఆనాటి సమాజం లోని వృత్తి కులాల దుర్భర పరిస్థితులను వెట్టిచాకిరిని ,అప్పులు తీర్చడానికి ఎదుర్కొనే శిక్షలను అంతా ఆ గ్రామంలో జరిగే సంఘటన ద్వారా చూపించాడు. నోటికి ఎంతోస్తే అంతా తిట్టడం ఆడవాళ్లు అని చూడక కనీసం కనికరం కూడా లేకుండా చంటి పాపకు పలు ఇవ్వకుండా పొలం పనిలో నిమగ్నం కావాలని పాలు ఇవ్వాలంటే దొర ముందే పాలు ఇవ్వాలని షరతులు పెట్టి అప్పటి దొరలు ఆడవాళ్లను హింసించే సంఘటనలు ఈ నవల్లో చాల ఉన్నాయ్ . ఇవన్నీ చుసిన గ్రామ ప్రజల్లో మెల్లగా సంగం వచ్చి చైతన్యం కల్పించి వారిలో కొంచెం ఎదురు తిరిగే దైర్యం నింపింది.

ఈ నవలలో ఒక మంచి పాత్ర నర్సిరెడ్డి అతని భార్య శాంతమ్మ ప్రజలకు వీళ్ళంటే చాలా ఇష్టం మంచి మనసు కలుపుగోలుతనం వాళ్లు గ్రామంలోని ప్రజలకు ఏ కష్టమొచ్చినా ముందు నర్సీరెడ్డి నే ఆశ్రయిస్తారు. ఇతని కొడుకు రవి పట్నంలో లా చదువు కుంటున్నాడు. ఈ రవి నే ప్రధానంగా చేసుకొని కథ ముందుకు సాగుతుంది. మొదట కమ్యూనిస్టు భావాల ఫై అంత ఆసక్తి చూపకపోయినా తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఆధారంగా నిజాం ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు తెలుసుకుంటాడు . దోపిడీ, దొరల పాలన , ప్రజలవెట్టిచాకిరీ, రజాకార్లు జరుపుతున్న దౌర్జన్యాలు ఆడవాళ్ళ పై ఆకృత్యాలు. చూసి ఎంతో ఆలోచించి సంఘం లో చేరుతాడు. అప్పటిదాకా నవలలో ప్రజలు పడుతున్న బాధలు . చూసి అందర్నీ సంఘానికి మద్దతుగా నిలవాలని కోరుకుంటాడు. రవి మేనమామ వకీలు గోపాల్ రెడ్డి సంఘసంస్కర్త గాంధేయవాది ఖద్దర్ ఉద్యమంలో పాల్గొంటూ ఉంటాడు. ఒక్కత్తే కూతురు శకుంతల తల్లి చిన్నప్పుడే చనిపోయింది. రవికి శకుంతల పెళ్లి విషయం చిన్నప్పుడే నిశ్చయమయింది. వీళ్లిద్దరు శంకుతల ఇంట్లో కలుసుకున్నప్పుడు వాళ్ళ మద్యల సంభాషణలు చదువుతుంటే వారి మధ్య ఉన్న ప్రేమ గాఢత అర్థం అవుతుంది . శకుంతల తన బావ రవిని పెళ్ళిచేసుకోవాలని కళలు కంటూ ఉంటుంది .

నవలలో పట్నం లో రవి రెడ్డి హాస్టల్ లో ఉంటూ అక్కడున్న మిత్రుడు వెంకట్ రెడ్డి ద్వారా కమ్యూనిస్ట్ బావాలవైపు ఆలోచన సాగి సంగం లో చేరి ప్రజలగురించి ప్రాణాలు అర్పించడానికే సిద్ధం అవటం .అప్పటి సంఘం లో చేరి ప్రాణాలకు లెక్క చేయకుండా రజాకార్లు ,పోలీస్ లతో పోరాడిన విప్లవకారులు ఎందరో ప్రాణాలు విడిచిన సంఘటనలు ,రచయిత రాసిన మాటలు ద్వారా వారి పోరాటం వచ్చే బావి తరాలకైనా సుఖ శాంతులు వస్తాయన్న ఆశతో పోరాడుతున్నమని చెప్పే మాటలు మనసుకి ఎంతో ఉత్తేజం కల్గిస్తాయి . శకుంతల తండ్రి వకిల్ వెంకటరెడ్డి కి రవి మధ్య సంభాషణలు ,కమ్యూనిస్ట్,గాంధీజీ భావజాలం తో సిద్ధాంత పరమైన చర్చల్లో ఇద్దరు ఒకర్ని ఒకరు మాది గొప్పంటే మాది గొప్ప నే చిన్నపాటి గొడవనే జరుగుతుంది . అప్పుడు ఉన్న యువకుల మనస్సు ఎంత రగిలి పోతుందో రవి వాదన బట్టి అర్థం చేస్కోవచ్చు .

సంగం కార్యకలాపాల్లో నిండా మునిగిన రవి గ్రామా గ్రామాన తిరుగుతూ ప్రజలని చైతన్యం చేయడం దొరలకి భయపడితే మీ బతుకులు మీ పిల్లల బతుకులు మారవని వెట్టిచాకిరి ఎన్నేళ్లు చేస్తారని ప్రశ్నించి .వారిని సంగం వైపు పోరాడాలని దిశానిర్దేశం చేస్తాడు. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని తన చివరి శ్వాస వరకు నిజాం ప్రబుత్వాన్ని పారద్రోలి హైదరాబా రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చేవరకు పోరాడతానను అని నిశ్చయించుకొని . శాకుంతలతో పెళ్లి వద్దని వాదించి శకుంతల జీవితం అన్యాయం చేయలేను అని చెప్పి సంగం కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటాడు .చివవరికి గ్రామంలో రవి వాళ్ళఅమ్మనాన్నలకు నిజాం పోలీస్ లతో లో ఇబ్బందులుతప్పవు. గ్రామంలో సంగం కి మద్దతు దారులు ఎక్కువయ్యారని దొర నిజాం పోలీస్ లని రజాకార్లని గ్రామానికి రప్పిస్తాడు .అప్పుడు గ్రామంలో ఉన్న ఆడవాళ్లను వెంబడించి చేర్చడానికి ప్రయత్నిస్తారు
వారి వాళ్ళ రవి చెల్లెలు బావిలో దూకి ప్రాణాలు కోల్పోతుంది అప్పటికి ఆమె ఒక బిడ్డకి తల్లి. గ్రామంలో రజాకార్లు పోలీస్ లు దొరికినోన్ని దొరికినట్టు కొట్టి చంపారు .వారి నుండి పారి పోయి కొంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు .దీనికి వ్యతిరేకంగా సంగం నాయకులూ అంత కలిసి బందూక్ లను చేతిలో పట్టుకొని దొరను చంపాలని .దొర గడి చేరుకుని అక్కడున్న వారి సహాయం తీస్కొని పోలీస్ లని ,దొరని మట్టుపెడ్తారు . దొర భార్యలు ఇద్దరు వెళ్లి కింది కులస్థుల ఇంట్లో వెళ్లి తలదాచుకున్నారు . అప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు చేసిన దుర్మార్గల్లాకు ప్రజల్లో ఎంత కోపం ఉందొ కన్నులార చూసారు. సంగం నాయకులూ ఒక్కకోరు ప్రాణాలు పోతున్న వారి పోరాట స్ఫూర్తిని మరవరు. రవి కి జైలు శిక్షపడిన తప్పించుకొని తన కర్తవ్యం నెరవేర్చుకుంటాడు. ఆ గ్రామం లో ఉన్న దూదుదేకుల దస్తగిరి సంగం తరపున పోరాడితే రజాకార్లు అతన్ని రజాకార్ల వైపు పోరాడాలని ప్రేరేపిస్తారు . దానికి వ్యతిరేకించి తన్నులు తింటాడు అతన్ని చిత్రహింసలకు గురిచేస్తారు . ఆంధ్రమహాసభల ప్రస్తావనకూడా నవలలో ఉంది . ఆంధ్ర మహాసభకు జై అనే నినాదాలు గ్రామాలలో సంగం నినాదాలు ఇచ్చాయి . వాళ్ళుకూడా నిజం ప్రభుత్వ పాలన కు ప్రజల్ని జాగృత పర్చడం 1948 సమయం లో వారి పాత్రను అర్థం చేస్కోవచ్చు . ఉద్యమ పోరాట సమయం సభలు పెట్టుకొనే అవకాశం లేకుండ నిజాం నిరంకుశపాలన సాగింది. దింతో రజాకార్లు రెచ్చిపోయి గ్రామాలో తిరుగుతూ తమకి అందినంత దోచుకెళ్లిపోయారు . ఆడవాళ్లను చిత్ర హింసలు పెట్టారు .

శకుంతల బయటి రాజకీయాలతో సబందం లేకున్నా తన జీవితాన్ని రవి లాగా కమ్యూనిస్ట్ పోరాటం కి సంగం కార్య కలాపాలకి కేటాయించుకోవాలని నిర్ణయం తీసుకుంది . అందుకే రవి జైల్లో ఉన్నపుడే వెళ్లి అక్కడే తాళి కట్టించుకుంది. ఆ తర్వాత తన జీవితం మొత్తం సంగం లో తిరుగుతూ దొరలను అంతమొందించేవరకు తన పోరాటం ఆగదని తెల్పి భర్త రవి బాటలోనే వెళ్లాలనుకుంది . కమ్యూనిస్ట్ పార్టీ ,ఆంధ్ర మహా సభ ,సంగం లో పాల్గొన్న చాల మంది రైతులు ఎంతో చైత్తన్యం పొంది .పోరాడితేగాని తమ పిల్లలకి మంచి భవిషత్ రాదు అని .ప్రాణాలకు తెగించి . నిజాం పోలీస్ లతో , రాజాకార్లతో వీరోచితంగా పోరాడి కామ్రేడ్ రవితో పాటు యాదగిరి సత్తిరెడ్డి కిష్టయ్య మారయ్య ప్రాణాలు విడిచారు. శకుంతల తన భవిష్యత్ గురించి అలొచన చేసి ఇక తన భర్త లాగా ఉద్యమం లొ తన పాత్ర పొషించలని సంఘం లో ఉన్న ఇతర ఆడవాళ్ళతో కలసిపోయింది. ఈ నవల్లో రచయిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగాక .నిజాం ప్రభుత్వ పాలనా పోయి భారత ప్రభుత్వ పాలనా వచ్చినాక కూడా సంఘం నాయకులు రైతులు కలిసి పోరాడి రజాకార్లకు ఎదిరించి నిజాం నిరంకుశ పాలనకు అంతమొందించిందిన వాళ్ళ ఆశలు నెరవేరలేదు అనేది రచయిత భావన .తెలంగాణ లో 1948 తర్వాత ఇలా ప్రజ రాజ్యం వచ్చిందన్న ఆనందంలో ప్రజలు ఉండగా మళ్లీ పారిపోయిన దొరలు దేశముఖ్ లు ,జమీందారు, పటేల్ పట్వారీలు , గ్రామాల్లోకి వచ్చి వారి అసలు రూపం వదిలేసి గాంధీ టొపిలతో ప్రత్యక్షమయ్యారు.

యూనియన్ సైనికుల రాకతో అక్కడున్న పటేల్ పట్వారీలు ఖద్దరు ధరించి రాజకీయ నాయకుల రంగు మార్చారు. కమ్యూనిస్టులు రైతులు సంగం వాళ్లు ఎంత కష్టపడ్డా మళ్లీ ఇది నాటి దోపిడొల్ల చెతిలో పడింది అని శకుంతల, లచ్చుమమ రైతాంగ పోరాటంలో కష్టపడ్డ వాళ్లకి వారి త్యాగాలకు ఫలితం దక్కలేదని . విప్లవ నాయకుల కల ఇంకా నిజం కాలేదు అని బాధపడ్డారు . దొంగలు రౌడీలు గుండాల ఆనాటి పెద్దలు చేతిలో ఈ ప్రభుత్వాలు ఏర్పడినాయి ఇక అవినీతి ,హింసాత్మక పాలన రాజ్యమేలుతుంది. కులాల కుమ్ములాటలు అమాయకుల ఆత్మ నాదాలు మనకు లభించిన ఫలితాలు విప్లవ వారసులందరూ ఇంటికో కుంపటి పెట్టుకొని ఎవరికి వారే విప్లవకారులు అంటూ దోపిడీ వర్గాలు అండగా ఉంటున్నారు. మంచి ప్రభుత్వం కోసం అన్ని వర్గాల వారు అందరూ చేయి కలపాలని రచయిత మనసులో ఆవేదన . మంచి పాలన కోసం మరో సంగ్రామం జరగాలని దానికోసం ప్రజలు వెట్టిచాకిరి గులాం గిరి పోవాలని ఈ నవలలో స్పష్టంగా కనిపిస్తుంది .విప్లవం వర్ధిల్లాలి అంటూ ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏర్పడాలని ఇలా రచయిత బందూక్ నవల ద్వారా సమాజానికి సందేశం ఇచ్చాడు .

ఆధార గ్రంధాలు :

1. ప్రతాప్ రెడ్డి కందిమళ్ల ”బందూక్” ,ప్రజాశక్తి బుక్ హౌస్ , హైదరాబాద్
2. రామ్ మోహన్ రాయ్ కడియాల , “మన తెలుగునవలలు” అజో విభో కందాళం ఫౌండేషన్ ,హైదరాబాద్ .
3. వరవరరావు – “తెలంగాణ విమోచనోద్యమం -తెలుగునవల -సమాజ సాహిత్య సంబంధాలు” ,ఒక విశ్లేషణ యువ ప్రింటర్స్ ,విజయవాడ
4. ఉదయ ఎం ,” తెలుగునవలల్లో తెలంగాణ జనజీవనం “ శ్రీ బాలాజీ ఆర్ట్ ప్రింటర్స్, హైదరాబాద్
5. వెంకటేశ్వరావు పుల్లబొట్ల – “తెలుగునవల సాహిత్య వికాసం” 1974
6. మాణిక్యరావు వెల్దుర్తి , “హైదరాబాద్ స్వాతంత్య్రాద్యోమ చరిత్ర”
7. తిరుమలరావు జయధీర్ – “తెలంగాణ రైతాంగ పోరాటం” , ప్రజాసాహిత్యం ,సాహితి సర్కిల్ ,హైదరాబాద్ .
8. కుటుంబరావు కొడవటిగంటి -”సాహిత్యం లో విప్లవోద్యమం”

నాగేంద్ర గడ్డం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు ​, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో