వెన్నెలని చూసుకునే కదా
చంద్రబింబం మిడిసి పడుతోంది
ప్రియా ! ఒక్కసారి
నీ ముసుగు తీస్తే నిజం తెలుస్తుంది
-సాహిల్ మానక్ పురీ
ఈరోజు ఆమెని
వరస పెట్టి ముద్దులు పెట్టుకున్నాను
ఈ ఘడియల కోసమే
ఎన్నో రోజులు లెక్క కట్టుకున్నాను
-కవి అమ్రోహీ
బతుకంతా నీ కోసం
పరితపిస్తూ జీవించా
ఎదురు చూపులు చూస్తూ
ఎందరినో ప్రేమించా
-హఫీజ్ హోషియార్ పురీ
నేనే లేనప్పుడు
ఇంకెందుకీ రసవద్గోష్టీ
ఎవరిని చూసి మరి
నీకా మందస్మిత దృష్టి
-జిగర్ మురాదా బాదీ
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`