జ్ఞాపకం- 73– అంగులూరి అంజనీదేవి.

ఒకసారి దిలీప్ చెప్పేటప్పుడు నువ్వుకూడా విన్నావ్! ఇప్పుడు రచనలు చెయ్యాలంటే వ్యాకరణాలు అవసరం లేకపోయినా ముందు తరం రచయితలు రాసిన పుస్తకాలు చదవాలని. నాకు ఉపయోగపడతాయనేగా ఆరోజు నేనా పుస్తకాలు కొన్నది? కొంచెం కూడా అర్థం చేసుకోరు. దాన్ని ఇప్పటికీ సాధిస్తున్నారుఅంది.

వాళ్ల తత్వమే అంత లైట్ తీసుకోవే అని చెప్పలేకపోతోంది హస్విత.

నేనేమో పుస్తకాలతోపాటు సమాజాన్ని చదువుతూ సాహితీ ప్రపంచం మీద అవగాహన పెంచుకుంటూ, ఏదో ఒక సమకాలీన సమస్యను తీసుకొని, దాని చుట్టూ కొన్ని పరిస్థితుల్ని అల్లి, దానికోసం ఓ పాత్రను సృష్టించి, ఒక బ్రహ్మలాగా ఆ పాత్రకి జీవం పొయ్యాలని కాగితాలముందు కూర్చుని, తపన పడుతుంటే వీళ్లేమో నన్ను ఒక లక్ష రూపాయల కోసం వేధిస్తున్నారు. పైకి చెప్పుకోలేని వేదనలో ముంచి క్షణ క్షణం చంపుతున్నారుఅంది.

వింటుంటే బాధగా వుంది హస్వితకి. ఇంకోటికూడా అన్పిస్తుందామెకు. అదేంటంటే కథలు, నవలలు రాసి అతి చిన్నవయసులోనే ఒక నవలాకారిణిగా ఎదిగి కీర్తిశిఖరాలను అందుకోబోతుంటే ఆమె జీవితమే ఓ కథలా అయిందని. ప్రపంచానికి మంచి రచనల్ని అందివ్వాలని ఇప్పటికే ఎన్నో గొప్ప రచనల్ని అందించిన ఆమె తన లక్ష్యం గురించి ఆలోచించటం మానేసి తనని నిర్లక్ష్యం చేస్తున్నవాళ్ల గురించే ఆలోచిస్తోందని.

ఇదంతా జయంత్ కి తెలుసా?” సడన్ గా అడిగింది హస్విత.

తెలిస్తేనే కదా నువ్వు రాసి ఏం సంపాయిస్తున్నావో కాని ఇంట్లో వాళ్లకి ఈ పుస్తకాల వల్ల మనశ్శాంతి లేకుండా పోతోంది అని అనటం!

అలా అన్నాడా?” ఆశ్చర్యపోయింది హస్విత.

ఇంకా చాలా అన్నాడులే! అవన్నీ ఎందుకిప్పుడు! అయినా మా అత్తగారిలాంటి తల్లులు ఏం పెట్టి పెంచుతారే తమ కొడుకుల్ని? తల్లులు ఎలా చెబితే అలా మారిపోతారు. మరీ ఇంత మారా? జయంత్ ఎంత మారాడో తెలుసానే! అతను ఒకప్పుడు ఆఫీసు నుండి వచ్చినప్పుడు మాత్రమే కొద్దిసేపు వాళ్లమ్మగారి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేవాడు. అదికూడా కాఫీ తాగుతూ. ఇప్పుడలా లేడు. పడుకునేటప్పుడే గదిలోకి వస్తున్నాడు. వచ్చాక కూడా నాతో సరిగా మాట్లాడడు. ఏదో అవసరం తీరేంత వరకు ఊ, ఆ. అనటమే కాని ఆ తర్వాత మాటలుండవు. నావైపు చూడడం కూడా వుండదుఅంది.

ఇంకా ఆశ్చర్యపోయింది హస్విత.

ఇలా ఎలా వుండగలుగుతారే ఈ మగవాళ్ళు? ఇలాంటి మార్పును నువ్వెలా స్వీకరించగలుగుతున్నావు?”

ఇదంతా మా అత్తగారి వల్లనే జరుగుతోంది. కానీ ఆవిడకి గాని, మా మామగారికి గాని భవిష్యత్తులో నాతో ఎలాంటి అవసరం వుండదానే? నాతో అసలు పనే లేనట్లు, వాళ్లకి నా అవసరమే రానట్లు ఎంత నిక్కచ్చిగా ప్రవర్తిస్తున్నారో చూడు. ఒకరోజైతే మా మామగారు నావైపు కళ్లెర్రజేసి ఉరిమి చూస్తూ కొట్టేవాడిలా చెయ్యికూడా ఎత్తాడు. నా మొగుడు ఇంట్లో లేని సమయం చూసి నామీద చెయ్యెత్తే అధికారం ఆయనకి ఎవరిచ్చారు? పైగా ఆయన తలుచుకుంటే జయంత్ కివేరే పెళ్లి చెయ్యగలడట. ఏదో పాపం పోనీ అని నన్ను ఈ ఇంట్లో వుంచుకున్నారట. లేకుంటే ఎప్పుడో వెళ్లగొట్టేవాళ్లటఅంటూ ఆగింది సంలేఖ.

సంలేఖ మామగారికి సొసైటీ మెంబర్ గా మంచి పేరుంది.

హస్వితకి వెంటనే తన మామగారు, అత్తగారు గుర్తొచ్చారు. తన మామగారు ఎక్కడా ఏ మెంబరూ కాదు. ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తుంటాడు. వచ్చిన డబ్బులు జేబులో పెట్టుకొని ఆ డబ్బుతో బోలెడు డబ్బును సంపాయించాలనుకుంటాడు. భార్యకోసం, కొడుకు కోసం ఖర్చు పెట్టడు. వాళ్లదేముందిలే నాలుగు రోజులు తిండి లేకున్నా ఒక్కరోజు తిండి తిని, గాలి పీల్చుకొని బ్రతుకుతారనుకుంటాడు. ఆయన గురించి నిజాయితీగా చెప్పాలి అంటే ఆయనొక ప్రొఫెషనల్ జూదగాడు.

ఆ జూదంలోనే ఆయనకు తృప్తి వుంది. ఆనందం వుంది. పరువుతో పనిలేదు. ప్రతిష్టతో అవసరం లేదు. పెనుగాలికి సైతం భయపడని గడ్డిపోచలా వుంటాడు. అలాంటి ఆయనతో అత్తగారు ఏరోజూ సుఖపడింది లేదు. పది రూపాయలు తెచ్చివ్వగా చూసింది లేదు. ఆయన నోటితో నాలుగు మాటలు విన్నది లేదు. ఇప్పటికీ ఎందుకండీ ఈ పని? అని అడిగితే నాతో నీకెందుకు? నీ పనేదో నువ్వు చూసుకో!అంటాడు.

కనీసం ఆయన కోసం కూడా ఆయన బట్టలు కొనుక్కోరట. పాతవాటితోనే సర్దుకుపోతాడట. ఎక్కువగా దాయాదుల కర్మలప్పుడు రేవు దగ్గర కూర్చుంటే వియ్యపువాళ్లు వేసే ఆదరింపు బట్టల్నే వాడుకుంటాడట. ఇవన్నీ ఒకసారి వంటగదిలో వున్నప్పుడు అత్తగారు చెప్పారు. విని బాధగా చూడటం తప్ప తనేం చెయ్యగలదు? అలాంటి వ్యక్తితో ఒక జీవితకాలం అసంతృప్తిని అనుభవించినా కూడా ఆమెకు డబ్బుపట్ల వ్యామోహం లేదు. కోడలు తెచ్చే డబ్బుతో హోదా పెంచుకోవాలని, స్టెక్చర్ తెచ్చుకోవాలని లేదు. ఒక్క రోజుకూడా తనను కట్నం తేలేదని అడగలేదు. పుట్టింటి వాళ్లతో ఆస్తులు అమ్మించలేదు. ఉన్నదేదో తిందాం, ఉందాం, అన్నట్లే వుంటుంది. ఇంకా ఇలాంటి అత్తలు వుండబట్టే భూమ్మీద వర్షాలు పడుతున్నాయేమో!

ఏంటి హస్వితా! ఆలోచిస్తున్నావ్?” అవతల వైపు నుండి అడిగింది సంలేఖ.

ఏం లేదు లేఖా! మీ అత్తగారితో మా అత్తగారిని పోల్చుకొని చూసుకుంటున్నానుఅంది.

అంతలో కాల్ కట్ అయింది.

(ఇంకా ఉంది )

 

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో