అనాధశ్రమాలు
మూత పడాలి
అమ్మా , నాన్నలు
అందరికీ దొరుకుతారుగా !
****
ఊరును
కాపాడే తల్లికి
ఊరంతా చేసే పండుగ
బోనాల పండుగ
****
చెట్టు త్యాగం
ఎంత గొప్పదో !
తాను ఎండలో ఉన్నా
నీడను పంచుతుంది
చెట్టును
తక్కువ చేయకు
ప్రకృతి ప్రసాదించిన
ఆక్సీజన్ సిలెండర్
****
సెల్ ఫోన్
చేతికొచ్చింది
ఒకరికొకరు
కవరేజ్ ఏరియాలో లేరు
****
ఎంత పెద్దదాన్నయినా
అమ్మమ్మింటికి వెళ్తే
యిప్పటికీ
పాపాయినే
-వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~